Little cute girl feeds her father in Mumbai local train: ఈ సృష్టిలో తండ్రి, కూతురు మధ్య ఉండే అనుబంధం వివరించలేది. ఇద్దరి మధ్య బంధం ఎంతో అందమైంది కూడా. కూతురు ఎంత పెద్దదైనా.. తండ్రి చిన్న అమ్మాయిగానే ట్రీట్ చేస్తాడు. అమ్మాయి పుట్టినప్పటి నుంచి పెళ్లి చేసేవరకు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. అదే సమయంలో కూతురు కూడా తన తండ్రిపై ఎంతో ప్రేమగా ఉంటుంది. తాజాగా ఓ తండ్రి, కూతురికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చిన్నారి తన తండ్రికి ప్రేమగా ఆహరం తినిపిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబైలోని లోకల్ ట్రైన్‌లో చిత్రీకరించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను సాక్షి మెహ్రోత్రా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. ముంబైలోని లోకల్ ట్రైన్‌లో ఒక చిన్న అమ్మాయి తన తండ్రితో కలిసి డోర్ వద్ద కూర్చొని ఉంటుంది. అమ్మాయికి తన తండ్రి చిప్స్ ప్యాకెట్ కొనిస్తాడు. ఆ చిన్నారి ఎంతో ప్రేమగా తన తండ్రికి చిప్స్ తినిపిస్తుంటుంది. దాంతో అతడు ఎంతో సంబరపడిపోతుంటాడు. ఇద్దరి మధురమైన ప్రేమ హృదయాలను కదిలిస్తోంది. 



ఈ వీడియోను సాక్షి మెహ్రోత్రా ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. 14 లక్షలకు పైగా మంది వీక్షించారు. అంతే స్థాయిలో లైక్స్, కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ వీడియో చూసి చిన్నారి చర్యకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. పసిపిల్లల మనస్సు ఎంతో అందమైనది అంటూ అందరూ కామెంట్స్ పెడుతున్నారు. హృదయాన్ని కదిలించే వీడియో, మా నాన్న గుర్తొచ్చాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 


Also Read: Neeraj Chopra CWG: కామన్వెల్త్‌ గేమ్స్‌కు నీరజ్‌ చోప్రా దూరం.. కారణం ఇదే!


Also Read: Monkeypox Symptoms: భారత్‌లో పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే జాగ్రత్త పడండి!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.