Neeraj Chopra CWG: కామన్వెల్త్‌ గేమ్స్‌కు నీరజ్‌ చోప్రా దూరం.. కారణం ఇదే!

Neeraj Chopra miss Commonwealth Games 2022 due to injury. కామన్వెల్త్ పోటీల్లో కచ్చితంగా పతకం సాధిస్తాడని ఆశలు రేపిన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా గాయం కారణంగా తప్పుకున్నాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 26, 2022, 03:46 PM IST
  • అథ్లెటిక్ బృందంకు భారీ షాక్
  • కామన్వెల్త్‌ గేమ్స్‌కు నీరజ్‌ చోప్రా దూరం
  • నిరాశ వ్యక్తం చేస్తున్న భారత అభిమానులు
Neeraj Chopra CWG: కామన్వెల్త్‌ గేమ్స్‌కు నీరజ్‌ చోప్రా దూరం.. కారణం ఇదే!

Neeraj Chopra miss Commonwealth Games 2022 due to injury: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ 2022 ముంగిట భారత అథ్లెటిక్ బృందంకు భారీ షాక్ తగిలింది. కామన్వెల్త్ పోటీల్లో కచ్చితంగా పతకం సాధిస్తాడని ఆశలు రేపిన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. ఫిట్‌నెస్ సమస్యలతో కామన్వెల్త్ గేమ్స్ 2022కి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ సెక్రటరీ జనరల్‌ రాజీవ్‌ మెహతా మంగళవారం మీడియాకు వెల్లడించారు. దాంతో భారత అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 

నిజానికి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ 2022 ఫైనల్‌ సమయంలో భారత బళ్లెం వీరుడు నీరజ్‌ చోప్రా గాయపడ్డాడు. అదే గాయం కారణంగా నీరజ్ కామన్వెల్త్ గేమ్స్ 2022 నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఓ జాతీయ మీడియా వివరాల ప్రకారం నీరజ్ గజ్జల్లో గాయమైందని సమాచారం. నీరజ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటాడని ఆశించినప్పటికీ.. గాయం కారణంగా అది కుదరలేదు. 'కామన్వెల్త్‌ గేమ్స్‌ 2022లో నీరజ్‌ పాల్గొనడం లేదు. అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్ ఫైనల్ సమయంలో అతడు గాయపడటంతో ప్రస్తుతం ఫిట్‌గా లేడు' అని రాజీవ్‌ మెహతా చెప్పారు. 

గత ఆదివారం జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్ 2022లో నీరజ్‌ చోప్రా సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్ పోరులో ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మెడల్ సాధించిన రెండో భారత అథ్లెట్‌గా, నిలిచాడు. అదే సమయంలో తొలి తొలి జావెలిన్ త్రోయర్‌గా రికార్డు సృష్టించాడు. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే. నీరజ్ గాయం భారత క్రీడా అభిమానులను నిరాశకు గురిచేసింది.

Also Read: Monkeypox Symptoms: భారత్‌లో పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే జాగ్రత్త పడండి!  

Also Read: Mangal Gauri Vrat : ఇవాళ మంగళగౌరీని ఇలా పూజిస్తే.. పెళ్లి కాని అమ్మాయిలకు సద్గుణాల భర్త దొరుకుతాడు..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News