16 feet King Cobra Viral Video: ఈ భూ ప్రపంచంలో కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమైన సర్పం. కింగ్ కోబ్రాను నల్ల త్రాచు, రాచనాగు అని రకరకాల పేర్లుతో పిలుస్తుంటారు. సాధారణంగా కింగ్ కోబ్రా 12 నుంచి 20 అడుగుల పొడవు ఉంటుంది. ఇది తన పొడవులో మూడో వంతు వరకు పడగ ఎత్తగలదు. కింగ్ కోబ్రా కాటు వేసిందంటే వ్యక్తి 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం బతకడు. భారీ ఏనుగులు సైతం కింగ్ కోబ్రా కాటుకు బలవుతాయి. అయితే కింగ్ కోబ్రా విషం మిగతా పాముల కంటే అత్యంత విషపూరితమైనది కాకున్నా.. అది కాటేసే సమయంలో ఎక్కువ మొత్తంలో విషం చిమ్మిస్తుంది. అందుకే ప్రమాదకరమైన కింగ్ కోబ్రాకు అందరూ హడలిపోతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కింగ్ కోబ్రాను ఎంతో అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్స్ మాత్రమే పడుతుంటారు. స్నేక్ క్యాచర్‌లకు కూడా కింగ్ కోబ్రా అప్పుడప్పుడు చుక్కలు చూపిస్తుంది. 12 నుంచి 18 అడుగుల ఉండే కింగ్ కోబ్రాలు అయితే అస్సలు చేతికి చిక్కవు. ఈ క్రమంలోనే ముగ్గురు స్నేక్ క్యాచర్‌లకు బ్లాక్ కింగ్ కోబ్రా పట్టపగలే చుక్కలు చూపెట్టింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఇద్దరు లేడీ క్యాచర్‌లు (అక్కచెల్లెళ్లు) ఓ చెట్టు పొదలో భారీ బ్లాక్ కింగ్ కోబ్రాను చూస్తారు. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా అది అస్సలు చిక్కదు. 



సమాచారం అందుకున్న మరో మేల్ స్నేక్ క్యాచర్ కూడా రంగంలోకి దిగుతాడు. అయితే దాదాపుగా 16 అడుగుల కింగ్ కోబ్రా ముగ్గురికి చుక్కలు చూపిస్తుంది. పట్టుకోవడానికి ప్రయత్నించిన సమయంలో కాటేయడానికి మీదికి దూసుకొస్తోంది. దాంతో వారు చాలా కష్టపడాల్సి వస్తుంది. చివరకు కింగ్ కోబ్రాను చెట్టు పొదల్లో నుంచి ఖాళీ ప్రదేశానికి తీసుస్తారు. ఓ లేడీ స్నేక్ క్యాచర్ దాని తలపై కర్ర పెట్టి భూమికి అదిమిపట్టి పట్టేస్తుంది. ఆపై సంచిలో బందించి తీసుకెళుతారు. ఈ వీడియోను 'KingCobra Hunter' అనే యూట్యూబ్ ఛానెల్లో అప్ లోడ్ చేశారు. ఈ వీడియో వారం క్రితందే అయినా ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. 


Also Read: King Kobras Fight Viral Video: ఫిమేల్ కింగ్ కోబ్రా కోసం.. ఐదు గంటల పాటు కొట్టుకున్న రెండు మేల్ కింగ్ కోబ్రాలు!   


Also Read: Urfi Javed Latest Video : పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే.. ఉర్ఫీ వింత ప్రదర్శన.. అడ్డుగా ఫోన్‌లు మాత్రమే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.