Giant King Cobras Fight: ఒకటి కాదు రెండు కాదు.. ఫిమేల్ కింగ్ కోబ్రా కోసం 5 గంటల పాటు కొట్టుకున్న రెండు మేల్ కింగ్ కోబ్రాలు!

Giant King Cobras Fight: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రెండు మేల్ కింగ్ కోబ్రాలు.. ఫిమేల్ కింగ్ కోబ్రా కోసం కొట్టుకున్నాయి. 

Written by - P Sampath Kumar | Last Updated : Nov 19, 2022, 05:03 PM IST
  • ఫిమేల్ కింగ్ కోబ్రా కోసం
  • ఐదు గంటల పాటు కొట్టుకున్న మేల్ కింగ్ కోబ్రాలు
  • వీడియో చూస్తేనే వెన్నులో వణుకుపుడుతుంది
Giant King Cobras Fight: ఒకటి కాదు రెండు కాదు.. ఫిమేల్ కింగ్ కోబ్రా కోసం 5 గంటల పాటు కొట్టుకున్న రెండు మేల్ కింగ్ కోబ్రాలు!

Two Male King Cobras Fight for Female King Kobra for 5 Hours: ఆడదాని కోసం రాజ్యాలే కూలిపోయాయని ఎనకట ఓ సామెత ఉంది. రాజ్యాధికారం కోసం కాకుండా.. స్త్రీ కోసం యుద్ధం జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయని మన పెద్దలు చెబుతారు. అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకున్న పలు సినిమా కూడా ఉన్నాయి. కేవలం సినిమాలలోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా స్త్రీ కోసం కొట్టుకున్న చాలా మందిని మనం చూసే ఉంటాం. అమ్మాయి కోసం పోరాడి చనిపోయిన వారు ఎందరో ఉన్నారు. కేవలం మనుషులే కాదు జంతువులు కూడా కొట్టుకుంటాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో. 

ఈ భూ ప్రపంచంలో ప్రతి జంతువుకు ఓ మేటింగ్ సీజన్ (సంభోగ కాలం) ఉంటుంది. పాములకు కూడా సంవత్సరంలో మూడు నెలల మేటింగ్ సీజన్ ఉంటుంది. మేటింగ్ సీజన్‌లో ప్రతి పాము తమ జాతికి చెందిన పాముతో సంభోగం చేయడానికి ఆరాటపడుతుంది. ఈ క్రమంలోనే మేల్ కింగ్ కోబ్రా వాసన ద్వారా దగ్గరలో ఉన్న ఫిమేల్ కింగ్ కోబ్రాను పసిగడుతుంది. రెండు కలుసుకుని సంభోగంలో పాల్గొంటాయి. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రెండు మేల్ కింగ్ కోబ్రాలు.. వాసన ద్వారా దగ్గరలోని ఫిమేల్ కింగ్ కోబ్రా కోసం వెతుకుంటాయి. ఫిమేల్ కింగ్ కోబ్రా దగ్గరకు రాగానే.. రెండు మేల్ కింగ్ కోబ్రాలు ఒకడానికిమరొకటి తారసపడుతాయి. దాంతో అవి రెండు పోట్లాడుకుంటాయి. అవి రెండు దాదాపుగా ఐదు గంటల పాటు పోరాడతాయి. చివరకు ఓ పాము తన ఓటమిని అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 

Also Read: Sravanthi Chokarapu Pics: షర్ట్ బటన్‌లు తీసేసి.. స్పోర్ట్స్ బ్రాలో స్రవంతి చొక్కారపు హాట్ ట్రీట్!  

Also Read: Bigg Boss Vasanthi PR Team : పీఆర్ టీం గురించి బయటకు చెప్పేసింది.. బిగ్ బాస్ వాసంతి ఎమోషనల్ పోస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News