Flipkart Services: ఫ్లిప్‌కార్ట్‌లో సాంకేతిక సమస్య, కస్టమర్ల ఇబ్బందులు
Flipkart Services: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మొరాయించింది. సాంకేతిక సమస్యలపై పేజ్ ఓపెన్ కాక..కస్టమర్లు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కస్టమర్లు తమ అసహనాన్ని సోషల్ మీడియా వేదికలపై ప్రదర్శించారు.
Flipkart Services: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మొరాయించింది. సాంకేతిక సమస్యలపై పేజ్ ఓపెన్ కాక..కస్టమర్లు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కస్టమర్లు తమ అసహనాన్ని సోషల్ మీడియా వేదికలపై ప్రదర్శించారు.
ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అటు వెబ్‌సైట్, ఇటు యాప్ రెండింట్లోనూ సాంకేతిక సమస్యల కారణంగా చాలా సేపు పనిచేయలేదు. ఒకేసారి రెండూ పనిచేయకపోవడంతో కస్టమర్లు ఇబ్బంది పడ్డారు. ఒక్కోసారి ఫ్లిప్‌కార్ట్ వెబ్‌పేజి తెర్చుకున్నా..పూర్తిగా లాగిన్ అయిన తరువాత చాలా సేవలు కన్పించలేదు. అటు మొబైల్ యాప్ కూడా అదే పరిస్థితి. ఆన్‌లైన్ పర్చేజింగ్ కోసం సెర్చ్ చేసిన ప్రతిసారీ..ఎర్రర్ మెస్సేజ్ వస్తోందని యూజర్లు మండిపడ్డారు. కస్టమర్ల అసహనం అంతా సోషల్ మీడియాపై కన్పించింది. ఎర్రర్ మెస్సేజ్ వస్తుండటంతో ఆర్డర్ ప్లేస్ చేయలేక ఇబ్బందులు పడ్డారు. పండుగ సమయంలో ఇలా జరగడంతో కస్టమర్లు విసిగిపోయారు. ఈ సమస్యపై ఫ్లిప్‌కార్ట్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఫ్లిప్‌కార్ట్‌కు (Flipkart) అత్యధికంగా 35 కోట్లమంది కస్టమర్ల బేస్ ఉంది.
Also read: Viral News: అమెరికాలో వింత సంఘటన.. ఆకాశం నుంచి చేపల వర్షం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook