Girl Stunt Video: ఏదో చెయ్యాలనుకుంటే.. ఇంకేదో అయింది! ఈ అమ్మాయి స్టంట్ చూస్తే మైండ్ బ్లాంకే
Girl Boy Stunt Video goes viral. ఊహించని స్టంట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ అబ్బాయి, అమ్మాయి ఏదో చెయ్యాలనుకుంటే.. ఇంకేదో అయింది అయింది.
Girl Fails to do Stunt after Boy Lifting: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో నిత్యం ఏదో ఒక వార్త, వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలు ఉంటాయి. ప్రాంక్‌లు, జంతువులకు సంబంధించిన ఫన్నీ, భయానకమైవి, ఊహించనివి కూడా ఉంటాయి. తాజాగా స్టంట్‌లకు సంబంధించిన వీడియోలు కూడా తెగ వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఊహించని స్టంట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ అబ్బాయి, అమ్మాయి ఏదో చెయ్యాలనుకుంటే.. ఇంకేదో అయింది అయింది.
నెట్టింట వైరల్ అవుతున్న 7 సెకన్ల వీడియోలో ఇంటి ఆవరణంలో ఉన్న గార్డెన్‌లో ఒక అబ్బాయి, అమ్మాయి స్టంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి అబ్బాయి భుజంపై చేయి వేసి ఒక్కసారిగా దూకుతుంది. యువకుడు తన చేతులతో అమ్మాయిని పైకి లేపి పట్టుకుంటాడు. అబ్బాయి బ్యాలెన్స్ తప్పడంతో.. యువతి ఒక్కసారిగా అతడి వీపు భాగం నుంచి కిందపడుతుంది. అమ్మాయి తల నేరుగా నేలకు తాకుంతుంది. వీడియో ప్రకారం అమ్మాయికి గాయం అయినట్లు కనిపిస్తుంది.
అమ్మాయికి సంబందించిన స్టంట్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో 'Funny Fail Videos' అనే యూజర్ పోస్ట్ చేశారు. ఈ వీడియో అప్‌లోడ్ చేసినప్పటి నుంచి వేలాది మంది వీక్షించారు. ఇప్పటికే లక్ష్యకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో షేర్స్, లైకుల కామెంట్స్ కురుస్తున్నాయి. అమ్మాయి మెడ విరిగింది, ఇలాంటి స్టంట్ నిపుణుల ఆధ్వర్యంలోనే చేయాలి, అమ్మాయి పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: TS Inter Exams-2022: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook