Gorantla Rajendra Prasad Passes Away: తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ (86) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం (జూలై 7) ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూసిన మరుసటిరోజే నిర్మాత రాజేంద్రప్రసాద్ కూడా కన్నుమూయడం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. రాజేంద్రప్రసాద్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
తెలుగులో 1963లో రాముడు భీముడు చిత్రానికి సహ నిర్మాతగా గోరంట్ల రాజేంద్రప్రసాద్ సినీ పరిశ్రమలోకి అడుగపెట్టారు. మాధవి పిక్చర్స్ బ్యానర్‌తో దొరబాబు, సుపుత్రుడు, బందిపోటు దొంగలు, కురుక్షేత్రం, ఆటగాడు వంటి చిత్రాలను రాజేంద్రప్రసాద్ నిర్మించారు. మూవీ మొఘల్ రామానాయుడు నిర్మించిన ఎన్నో చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. జీవన తరంగాలు, స్త్రీ జన్మ, శ్రీకృష్ణ తులాభారం, ప్రతిజ్ఞా పాలన వంటి చిత్రాలను రామానాయుడుతో కలిసి నిర్మించారు. రాజేంద్రప్రసాద్ కన్నుమూతతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.
కాగా, ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు బుధవారం (జూలై 6) కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 800 పైచిలుకు చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా వ్యవహరించారు. తెలుగులో చిరంజీవి సహా ఎంతోమంది టాప్ హీరోల చిత్రాలకు ఎడిటర్‌గా వ్యవహరించారు. గౌతమ్ రాజు కుటుంబానికి తక్షణ సాయంగా చిరంజీవి రూ.2 లక్షలు అందజేశారు. ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
Also Read: TS Inter Exams-2022: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook