Girl Catched Two Giant Snakes , Today's Google Trending Video : జనాభా పెరుగుదల ఓవైపు.. డెవలప్ మెంట్ పేరుతో అడవుల్లోకి చొచ్చుకెళ్తున్న నివాసాలు, ప్రభుత్వ కట్టడాలు మరోవైపు వెరసి అడవిలో స్వేచ్చగా విహరించే వణ్య ప్రాణులకు ఆవాసం కరువై జనాల మధ్యకు వస్తోన్న ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతాలు గణనీయంగా తగ్గిపోతుండటంతో వన్యప్రాణులకు కూడా తమ సహజ ఆవాసాలు తగ్గిపోతున్నాయి. నివాసం కోల్పోతున్న వణ్య ప్రాణులు సహజంగానే జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు వణ్యప్రాణులు జనాలపైకి దాడి చేస్తే.. ఇంకొన్నిసార్లు జనమే తమ రక్షణ కోసం వణ్య ప్రాణులపైకి దాడికి పాల్పడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కృూర మృగాలకు ఎలాగూ జనావాసాల్లో చోటు లభించనప్పటికీ.. పాములకు మాత్రం జనం మధ్యే జీవించడం వాటికి ఎప్పుడో సర్వ సాధారణమైపోయింది. గ్రామాల్లో, పట్టణాల్లో పాములు జనం ఇళ్ల మధ్యే కనిపించడం మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. చెట్లు, పుట్టల వెంట ఆవాసాలు ఏర్పాటు చేసుకుని జనం మధ్యలోకి వస్తోన్న పాములు కొన్నిసార్లు కఠినాత్ముల కంట పడి వారి చేతిలోని కర్ర దెబ్బకు బలవుతున్నాయి. కొంతమంది పామును చూడగానే వాటికి హాని చేయకుండా స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించి వాటిని పట్టుకుని అడవిలో విడిచిపెట్టేలా చేస్తున్నారు. 


స్నేక్ క్యాచర్స్ వచ్చి పాములను పట్టుకుంటే చాలా నైపుణ్యంతో ఒక ఐరన్ రాడ్ తో మృధువుగా టచ్ చేస్తూ వాటిని పట్టుకుంటారు. పాములను పట్టుకోవడానికి వీలుగా, పాములు చేజారిపోకుండా ఉండేందుకు ఆ ఐరన్ రాడ్ చివరన కాస్త వంగి ఉంటుంది. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ యువతి చూస్తుండగానే తన చేతిలో ఏమీ లేకుండానే రెండు పెద్ద పెద్ద పాములను ఉత్తి చేతులతో పట్టుకుని అందరిని షాక్ కి గురయ్యేలా చేసింది.



 


ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న యువతి ధైర్యం చూసి చాలామంది షాక్ అవుతుండగా.. కొంతమంది ఆమెని చీవాట్లు పెడుతున్నారు. చేతిలో ఏ సహాయం లేకుండానే మెరుపు వేగంతో ఆ పాములను ఎలా పట్టుకోగలిగింది, అంత ధైర్యం, తెగువ ఆ అమ్మాయికి ఎలా వచ్చాయి అని ఆశ్చర్యం వ్యక్తంచేసిన.. ఆ అమ్మాయిలోని తెగువను ప్రశంసిస్తున్నారు. ఒకవేళ ఆ యువతి ఆ పాములను పట్టుకోకపోయి ఉంటే.. అవి ఎవరినైనా కాటేసి ఉంటే వారి పరిస్థితి ఏంటి అని సందేహం వ్యక్తంచేస్తున్నారు. 


ఇది కూడా చదవండి : Giant Black King Cobra Video: పంట పొలాల్లోకి భయంకరమైన గిరి నాగు పాము.. పరుగులు తీసిన రైతులు


మరోవైపు ఆ పాములను అంత రఫ్‌గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ఇంకొంతమంది అసహనం వ్యక్తంచేశారు. ఇది పాములను హింసించడం, వాటికి హాని చేయడమే అవుతుంది అనేది వారి ఉద్దేశం. పైగా అవి తన నుంచి తప్పించుకుని వెళ్లాలని గట్టిగా ప్రయత్నించిన కొద్దీ ఆ యువతి వెంటపడి మరీ వాటిని పట్టుకున్న తీరు మరీ దారుణంగా ఉందంటున్నారు ఆ యువతిని తప్పుపడుతున్న నెటిజెన్స్. ఎవరి ఉద్దేశం ఎలా ఉన్నప్పటికీ.. చూడ్డానికి చాలా అసాధారణంగా ఉన్న ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే 1 మిలియన్‌కు పైగా జనం ఈ వీడియోను వీక్షించారు. ఇది కూడా చదవండి : Giant Anaconda Snake Video: నిజంగానే ఇంత భారీ ఆనకొండ ఉంటుందా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి