Snake Bites Woman: యువతి పెదాలని గట్టిగా ముద్దాడిన పాము.. వీడియో వైరల్

Snake Bites Woman: పామును పాములానే చూడాలి కానీ పక్కింటి అమ్మాయిలానో లేక కాలేజ్‌లో బాయ్ ఫ్రెండ్‌లానో చూడొద్దు. ఎందుకంటే మనుషులకు ఉండే ఎమోషన్స్ పాములకు ఉండవు. పాములకు ఉండే ఎమోషన్స్ వాటికి ఉంటాయి కానీ అవి మనుషులకు అర్థం కావు. ఎందుకంటే అవి హ్యూమన్‌ వేవ్‌లెంత్‌కి మ్యాచ్ అవవు. అయినా సరే నేను పామును పట్టుకుంటా, ముద్దాడుతా అంటే ఇదిగో ఇలానే జరుగుతుంది.

Written by - Pavan | Last Updated : Aug 5, 2023, 10:59 AM IST
Snake Bites Woman: యువతి పెదాలని గట్టిగా ముద్దాడిన పాము.. వీడియో వైరల్

Snake Bites Woman After She tried to kiss it : జంతువులు, సర్పాలు అంటే కొంతమందికి ఎనలేని అభిమానం, ప్రేమ ఉంటాయి. అవి తమ కంటపడినప్పుడల్లా వాటిపై తమకు ఉండే ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే వాటిని చేతుల్లోకి తీసుకోవడం, కౌగిలించుకోవడం లేదా ముద్దుపెట్టడం లాంటివి చేస్తుంటారు. కానీ జంతువులకు, పాములకు స్వీయ విచక్షణ ఉండదు కదా.. అవి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయో ఎవ్వరూ చెప్పలేరు. ఇదిగో ఇప్పుడు మనం చూడబోయే ఈ వీడియోలో కూడా ఒక యువతికి ఓ పాము మధ్యలో అలాంటి ఘటనే జరిగింది. 

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక పాత వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పామును ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించిన ఒక యువతి.. అనుకోకుండా అదే పాము చేతిలో కాటుకు గురవడం చూడొచ్చు. సర్వ సాధారణంగా ఎవరైనా సరే పాముసను చూస్తే హడలిపోయి ఆ పాముకు దూరగా పరుగెడతారు కానీ ఈ వీడియోలో ఉన్న యువతి మాత్రం అలా కాదు. పామును చూసిన తరువాత కూడా పాముకు ఏ మాత్రం భయపడకపోగా.. పెంపుడు జంతువుని ముద్దాడబోయినట్టుగా ఆ పాము తలపై కిస్ పెట్టుకునే ప్రయత్నం చేసింది. 

అయితే, ఆ యువతి తనని ముద్దు పెట్టుకోవడానికి వస్తోంది అనే విషయం ఆ పాముకు తెలియదు కదా.. అందుకే అది ఆ యువతితో తనకు ఏదో హానీ కలగబోతోంది అనే భయంతో ఛటుక్కున కాటేసింది. అప్పటి వరకు అటువైపునకు తిరిగి ఉన్న ఆ పాము.. యువతి తల తనకు దగ్గరగా రావడం చూసి భయంతో యువతి పెదాలపైనే కాటేసింది. ఊహించని పరిణామానికి ఖంగుతిన్న యువతి విలవిలలాడుతూ పాము కాటు బారి నుంచి తప్పించుకునేందుకు గింజుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by meme kh? meme dong (@memeloglc)

ఇది కూడా చదవండి : Giant Anaconda Snake Video: నిజంగానే ఇంత భారీ ఆనకొండ ఉంటుందా ?

వాస్తవానికి పామును చూసి పాము నుంచి హానీ జరగకుండా ఉండటం కోసం ఆ యువతి దూరం జరగాల్సిందిపోయి.. ఆ యువతి నుంచి తనకు ఏమైనా హానీ పొంచి ఉందేమో అనే భయంతో ఆ పామే యువతిని కాటువేయడం ద్వారా ఆ యువతి బారి నుంచి తప్పించుకోవాలని అనుకుంది ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థం అవుతోంది. అంటే ఒక రకంగా సీన్ రివర్స్ అయిందన్నమాట. అందుకే పాములు కానీ లేదా ఏవైనా వణ్యమృగాలతో కానీ డీల్ చేసేటప్పుడు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కాదు కూడదు అని లైట్ తీస్కుని దగ్గరిగా వెళ్లితే ఇదిగో ఈ వీడియోలో సీన్‌లా ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ స్నేక్ వీడియోను ఇప్పటికే కొన్ని లక్షల మంది నెటిజెన్స్ వీక్షించగా.. కొన్ని వేల మంది లైక్ చేశారు.

ఇది కూడా చదవండి : Rare White Snake Video: జనాన్ని భయంతో పరుగులు పెట్టించిన అరుదైన పాము

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News