Gmail down: జీ మెయిల్ సర్వర్స్ డౌన్.. ట్రెండ్ అవుతున్న #GmailDown memes
Gmail servers down in India: జీమెయిల్ డౌన్ అయిన తీరు సరిగ్గా వారం రోజుల క్రితమే ప్రపంచవ్యాప్తంగా ఏడు గంటల పాటు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ (Facebook, whatsapp, Instagram down) సర్వర్స్ డౌన్ అయిన ఉదంతాన్ని మళ్లీ గుర్తుచేసింది.
Gmail servers down in India: న్యూ ఢిల్లీ: జీమెయిల్ సర్వర్స్ డౌన్ అయ్యాయి. సాఫ్ట్‌వేర్, టెక్నాలజీలో ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ సంస్థగా పేరున్న గూగుల్‌కి కూడా సర్వర్ డౌన్‌తో ఇబ్బందులు తప్పలేదు. భారత్‌లో మంగళవారం మధ్యాహ్నం తర్వాత పలు ప్రాంతాల్లో జీమెయిల్ డౌన్ అవడంతో యూజర్స్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీమెయిల్ డౌన్ అయిన తీరు సరిగ్గా వారం రోజుల క్రితమే ప్రపంచవ్యాప్తంగా ఏడు గంటల పాటు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ (Facebook, whatsapp, Instagram down) సర్వర్స్ డౌన్ అయిన ఉదంతాన్ని మళ్లీ గుర్తుచేసింది.
దేశంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి జీమెయిల్ సేవలు డౌన్ (Gmail services down) అయ్యాయి. అత్యవసర పరిస్థితుల్లో జీ మెయిల్ సేవలు ఉపయోగించుకోలేకపోయిన నెటిజెన్స్ సోషల్ మీడియా వేదికగా గూగుల్‌పై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. దీంతో ట్విటర్‌లో #GmailDown అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవడం కనిపించింది. ఇంకొంత మంది జీమెయిల్‌పై సెటైర్లు వేస్తూ మీమ్స్ (viral memes) పోస్ట్ చేయసాగారు.
Also read : Realme GT Neo 2 mobile specs: ఆకట్టుకునే ఫీచర్స్‌తో రియల్‌మి జిటి నియో 2 మొబైల్
డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 68 శాతం మంది యూజర్లు జీమెయిల్ పనిచేయడం లేదని రిపోర్ట్ చేయగా.. మరో 18 శాతం మంది యూజర్లు సర్వర్ సంబంధిత సమస్యలను ఎత్తిచూపించారు. ఇంకో 14 శాతం మంది యూజర్లకు జీమెయిల్ లాగిన్ సమస్యలు (Gmail) తలెత్తిన్నట్లు డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ పేర్కొంది.
Also read : Facebook live Audio feature: లైవ్ ఆడియో రూమ్స్ ఫీచర్‌తో పాటు Soundbites కూడా రెడీ చేస్తోన్న ఫేస్‌బుక్
Also read : WhatsApp users jumped to Telegram: వాట్సాప్‌కి షాక్ ఇస్తూ టెలిగ్రామ్‌లో చేరిన 70 మిలియన్ల మంది యూజర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook