Gmail New Feature: నిత్య జీవితంలో జీ మెయిల్ అనేది ఓ భాగంగా మారిపోయింది. పోటీ ప్రపంచంలో బెస్ట్ కమ్యూనికేషన్ సర్వీస్ ఇది. వాట్సప్ లాంటివి ఎన్ని ఉన్న జీ మెయిల్ ఎప్పుడూ ప్రత్యేకమే. అందుకే మరో సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది గూగుల్.
గూగుల్ (Google) సంస్థ ప్రవేశపెట్టే ప్రతి ప్రొడక్స్ మార్కెట్లో కీలకమైనదే. అందులో ప్రధానమైనది జీ మెయిల్. బెస్ట్ కమ్యూనికేషన్ సర్వీస్ ఇది. ఫైల్స్, డాక్యుమెంట్స్ పంపాలంటే జీ మెయిల్ అనేది మంచి ప్రత్యామ్నాయంగా ఉంది. వాట్సప్ లాంటి కమ్యూనికేటెడ్ యాప్స్ ఎన్ని వచ్చినా జీ మెయిల్ ప్రత్యేకత దానిదే. ఇప్పుడు గూగుల్..జీ మెయిల్‌లో మరో ప్రత్యేక పీచర్ (Gmail new feature) అందుబాటులో తీసుకొచ్చింది.
జీ మెయిల్‌కు (Gmail)వచ్చిన ఫోటోల్ని నేరుగా గూగుల్ ఫోటోస్‌లో సేవ్ చేసుకునే ఆప్షన్ తీసుకొచ్చింది. ఇక మెయిల్‌కు వచ్చిన ఫోటోల్ని మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవడం, తిరిగి గూగుల్ ఫోటోస్‌లో అప్‌లోడ్ చేసుకోవడం అవసరం లేదిక. అంటే నేరుగా జీ మెయిల్ నుంచి ఫోటోల్ని గూగుల్ ఫోటోస్ స్టోర్‌కు పంపించవచ్చు. ఫోటోపై డౌన్‌లోడ్ బటన్ పక్కనే యాడ్ టు డ్రైవ్ అనే ఆప్షన్ కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే..ఫోటోస్ డ్రైవ్‌లో వెళ్లిపోతాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అమల్లో ఉన్న ఈ ఫీచర్..త్వరలో అన్ని ప్రాంతాల్లో ప్రవేశపెట్టనుంది గూగుల్ సంస్థ.
Also read: Smartphones offers: పాత స్మార్ట్‌ఫోన్ స్థానంలో కొత్తది కొంటున్నారా ? ఇదిగో mobiles offers
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook