Google Products | గూగుల్ తన భారతీయ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ కొత్త మల్టీలింగ్వల్ మోడల్ MuRIL ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది మొత్తం 16 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ| Trump Residency: బిజినెస్ ట్రంప్ బ్లెడ్ లోనే ఉంది... ఇల్లు రాజభవనం కన్నా తక్కువేం కాదు


భారతదేశంలో (India) జరుగుతున్న L10 ఈవెంట్‌లో భాగంగా ఈ కొత్త ఫీచర్‌ను భారతీయులకు అందుబాటులోకి తీసుకురానుంది అని ప్రకటించింది గూగుల్. ఈ కొత్త ఫీచర్ వల్ల గూగుల్ ప్రోడక్ట్స్‌ను వినియోగించడం సులభం అవుతుంది .


ప్రస్తుతం ఇండియాలోని గూగుల్ (Google) సెర్చ్ రిజల్ట్స్‌లో ఇంగ్లిష్ లేదా హిందీలో డిఫాల్ట్‌గా ఫలితాలు కనిపిస్తాయి. ఈ రెండు భాషల మధ్యలోనే యూజర్లు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. దీని వల్ల గూగుల్ సెర్చ్ ఫలితాల కోసం వెతికే వారి సంఖ్య పదుల రెట్లో పెరిగినట్టు తెలిపింది గూగుల్.  


 



ALSO READ| Manhole: మ్యాన్ హోల్ ను మ్యాన్ హోల్ అని ఎందుకంటారో తెలుసా ?


అందుకే ఇతర భాషలను కూడా జోడించింది. ఇందులో తెలుగు, తమిళం, బంగ్లా, మరాఠీ కూడా ఉన్నాయి అని తెలిపింది. 


ఇకపై గూగుల్ సెర్చ్ చేస్తే యూజర్ ఎకౌంట్ క్రియేట్ అయిన ప్రాంతాన్ని బట్టి, అతను ఉన్న స్థలాన్ని బట్టి ఆ భాషలో ఫలితాలు వెల్లడవుతుంది. యూజర్లు సులభంగా తమ భాషను మార్చుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది గూగుల్.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook