Thousands of passengers sit on Train Roof: పండగలు వచ్చాయంటే.. బస్సు లేదా రైలులో సీటు కోసం ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. సీటు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కోసారి దొరకదు. కొందరు ప్రయాణికులు గొడవపడడం కూడా జరుగుతుంటుంది. ఇక సీటు దొరకకపోయినా సొంతూరికి తప్పక వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి బస్సు లేదా రైలులో జనాలు కిక్కిరిసిపోతారు. ఒక్కోసారి ఇసుకపోయినా జారనంత జనాలు ఉంటారు. తాజాగా అంతకుమించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో బంగ్లాదేశ్‌కు సంబంధించినదిగా తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రంజాన్ సందర్భంగా బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని రైల్వే టిక్కెట్ కౌంటర్‌ల వద్ద జనాలు బారులు తీరారు. ప్రయాణికులకు తగ్గట్టుగా రైళ్లను షెడ్యూల్ చేయలేకపోవడంతో.. అక్కడివారు చాలా ఇబ్బందిపడ్డారు. అయినా కూడా పండగ కావడంతో గ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికులు మండుతున్న ఎండలను సైతం పట్టించుకోలేదు. రాకరాక వచ్చిన రైలులోనే ప్రయాణికులు అందరూ ఎక్కేశారు. బోగీల్లో స్థలం లేకపోవడంతో.. వేలాది మంది వాటి పైకి ఎక్కారు. కొందరు డోర్ దగ్గర వేలాడారు.



ఆడ, మగ, పిల్లజల్లా అనే తేడా లేకుండా అందరూ రైలు టాప్‌పైకి ఎక్కేశారు. కొందరు వ్యక్తులు ఇంజన్‌కి ఎక్కేశారు. ఒకరు అయితే చివరి బోగి వెనకాల వేలాడుతుండడం విశేషం. అందరూ ఎక్కాక ట్రైన్ స్టార్ట్ అయింది. అంతమంది ఉన్నా కూడా ఆ ట్రైన్ వేగంగా వెళ్లడం మరో విశేషం. ఇందుకు సంబందించిన వీడియోను nature_okayandmandeep__dhanda అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఉంది. 'ప్రపంచంలోనే అత్యంత రద్దీ రైలు మార్గం' అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన అందరూ షాక్ అవుతున్నారు.  


Also Read: Green Fennel Benefits: పచ్చి సోంపు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.. అవేంటో తెలిస్తే షాక్ అవుతారు!  
Also Read: White Hair Solution: చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తోందా.. ఈ కాయతింటే మీ జుట్టు నల్లగా మారిపోతుంది!   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.