Home Remedies for Black Hair: ప్రస్తుత కాలంలో లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. దీంతో కొత్తకొత్త రోగాలు, సమస్యలు వస్తున్నాయి. ఒకప్పుడు ముసలితనం చాయలుగా చెప్పే.. తెల్ల జుట్టు, బట్టతల లాంటివి ఇప్పుడు చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. కొందరు పిల్లలకు15-20 సంవత్సరాలు రాకముందే జుట్టు తెల్లగా మారిపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు యువకులు తీవ్రంగా ప్రయత్నించినా ఆశించిన ఫలితం మాత్రం దక్కడం లేదు.
మార్కెట్‌లో లభించే పలు రకాల కెమికల్ హెయిర్ డైలు జుట్టును నల్లగా మార్చడానికి చాలామంది వాడతారు. అయితే ఇలా చేయడం వల్ల జుట్టు గరుకుగా మారే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే.. వీటివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. అందుకే అందరూ సహజ మరియు ఆయుర్వేద పద్ధతులను అనుసరించడం చాలా మంచిది. సొరకాయ ఉపయోగించడం వలన తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. నల్లటి జుట్టు పొందడానికి ఈ సొరకాయను ఎలా ఉపయోగించాలో ఓసారి తెలుసుకుందాం.
సొరకాయ ఆయిల్:
చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు రావడం ప్రారంభం అయితే ఇంట్లోనే బాటిల్ గార్డ్ (సొరకాయ) ఆయిల్ సిద్ధం చేసుకోండి. దీని కోసం ముందుగా సొరకాయను పొట్టుతో కోసి వారం రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి. ఆపై ఒక గిన్నెలో 250 గ్రాముల కొబ్బరి నూనెను తీసుకుని వేడి చేయాలి. ఈ వేడి నూనెలో ఎండిన సొరకాయ ముక్కలను వేసి మరిగించాలి. సుమారు 15-20 నిమిషాల తర్వాత నూనెను ముక్కల నుంచి వేరుచేసి చల్లార్చాలి. నిద్రపోయే ముందు ఈ నేనును మీ జుట్టుకు అప్లై చేసి, ఉదయాన్నే కడిగేయాలి. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా అనుసరిస్తే.. మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
సొరకాయ రసం:
సొరకాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు కాల్షియం మరియు విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. దీని వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సొరకాయకు రసాన్ని తయారు చేసుకుంటే శరీరం చల్లబడడమే కాకుండా తెల్ల జుట్టు మళ్లీ నల్లగా మారుతుంది. రోజూ ఓ గ్లాసు రసాన్ని తీసుకోవాలి.
సొరకాయ తొక్క:
సొరకాయ తొక్కలను ఉపయోగిస్తే కూడా మీ జుట్టుకు గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. ముందుగా సొరకాయకు ఉండే తొక్కను వేరు చేయాలి. ఆ తొక్కల నుంచి రసం తీసి పిప్పిగా చేయాలి. ఆ తొక్కల పిప్పిని తలకు పట్టించి కాసేపు అలాగే ఉంచి శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేయడం ద్వారా మీ జుట్టు నల్లగా ఉండటమే కాకుండా పగిలిపోకుండా ఉంటుంది.
Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ ఆఫర్.. రూ.1000కే POCO M4 Pro మొబైల్ మీ సొంతం! లిమిటెడ్ ఆఫర్
Also Read: Sprouts for Diabetes: మీకు డయాబెటిస్ ఉందా..? అయితే ఇది మీ కోసమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.