Incredible Health Benefits Of Green Fennel Seeds: భారతీయుల ఆహారపు అలవాట్లలో సోంపు గింజలు తీసుకోవటం ఒక భాగం. ఎన్నో తరాలుగా ఈ అలవాటు కంటిన్యూ అవుతూ వస్తోంది. మనం హోటల్‌లో తిన్న తర్వాత తప్పనిసరిగా సోంపు ఇస్తారు. దీంతో మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా ఇది నోటి రిఫ్రెష్‌మెంట్‌గా కూడా పనిచేస్తుంది. సోంపు తినడం వల్ల ఇతర అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. నిత్యం భోజనం చేశాక సోంపు గింజలను తినడం అలవాటుగా చేసుకుంటే.. ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఓసారి చూద్దాం.
సోంపు గింజల్లో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, మంచి పోషకాలు ఉంటాయి. ఈ గింజల్లో రాగి, పొటాషియం, జింక్, విటమిన్ సి, ఐరన్, సెలెలియం, ఫైబర్, మాంగనీస్, కాల్షియం, మెగ్నీషియం వంటి అనేక ఖనిజాలు విరివిగా ఉంటాయి. ఈ గింజలు సంవత్సరం మొత్తం దొరుకుతాయి. ఇవి సాధారణంగా పొడి రూపంలో లేదా గింజల రూపంలో ఉంటాయి. దీన్ని తినడానికి రెగ్యులర్ సమయం అంటూ లేదు.. రోజులో ఎప్పుడైనా తినవచ్చు.
జీర్ణక్రియ:
బయటి ఆహారం తీసుకోవడం వలన చాలా మందికి జీర్ణక్రియ సమస్యలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో పచ్చి సోంపు లేదా సోంపు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఎసెన్షియల్ ఆయిల్ జీర్ణ వ్యవస్థను పటిష్టం చేయడానికి పనిచేస్తుంది. అలాగే పొట్ట సమస్యలను దూరం చేసే ఎస్ట్రాగాన్, యాంటిస్పాస్మోడిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, అనెటోల్, ఫ్యాన్‌కాన్ వంటి గుణాలు కూడా ఉంటాయి.
క్యాన్సర్ నివారణ:
రోజూ పచ్చి సోంపు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నిరోధించే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించేందుకు పని చేస్తాయి. సోంపు గింజలను ప్రతి రోజు తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ మరియు కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
బరువు తగ్గడం:
సోంపు బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి బరువు తగ్గుతారు. దీనితో పాటు ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. ప్రతిరోజు తినడం వలన శరీరంలో కొవ్వు తక్కువగా ఉండేలా చేస్తుంది. పోషక పదార్ధాలను సంగ్రహించుకునే విధానాన్ని మెరుగుపరుస్తుంది. సోంపు టీ త్రాగటం వల్ల శరీరంలో ఉండే అధిక కొవ్వు కరుగుతుంది.
రక్తపోటు నియంత్రణలో:
సోంపు గింజలను తినడం వల్ల లాలాజలములో నైట్రైట్ శాతం పెరుగుతుంది. ఇది రక్తపోటుని సాధారణ స్థితిలో ఉండేలా చూస్తుంది. సోంపు గింజల్లో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో నీటిని సమతుల్యతతో ఉండేలా చూస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే ఇది చాలా ముఖ్యం.
Also Read: White Hair Solution: చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తోందా.. ఈ కాయతింటే మీ జుట్టు నల్లగా మారిపోతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.