Newly Wed Couple Fire Stunt: 'వెడ్డింగ్ ఎగ్జిట్' అంటే పెళ్లి తంతులో చివరి కార్యక్రమం. రిసెప్టెన్ ముగిశాక కొత్త జంటను ఆ వేదిక నుంచి గ్రాండ్‌గా సాగనంపుతారు. ఈ క్రమంలో డీజే పాటలు, డ్యాన్సులతో హోరెత్తిస్తారు. బాణసంచా కాలుస్తారు. మొత్తంగా సరదా సరదాగా, సందడిగా ఈ కార్యక్రమం సాగుతుంది. కానీ ఓ కొత్త జంట తమ వెడ్డింగ్ ఎగ్జిట్‌ను అందరి కన్నా భిన్నంగా ప్లాన్ చేసుకున్నారు. రిసెప్షన్‌కి వచ్చిన అతిథులు షాకయ్యేలా ఫైర్ స్టంట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గేబ్-అంబిర్ అనే ఆ కొత్త జంట ప్రొఫెషనల్ స్టంట్ మాస్టర్స్ కావడంతో ఆ ఫైర్ స్టంట్ చేశారు. స్టంట్‌ ప్రారంభించే ముందు ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఒకచోట నిలుచున్నారు. ఇంతలో ఓ వ్యక్తి అంబిర్ కుడి చేతిలో పట్టుకున్న ఫ్లవర్ బొకేకి నిప్పంటించాడు. క్షణాల్లో ఆ మంటలు వధూవరుల వీపు భాగంలోకి వ్యాపించాయి. అలానే రెండడుగులు ముందుకు నడిచిన జంట... ఆ తర్వాత చిన్నగా పరిగెత్తారు. 


కొద్ది దూరం పాటు పరిగెత్తి.. ఒకచోట మోకాళ్లపై కూలబడ్డారు. వెనకాలే పరిగెత్తుకొచ్చిన ఓ వ్యక్తి వెంటనే మంటలార్పేశాడు. ఈ కొత్త జంట చేసిన ఫైర్ స్టంట్‌కి వెడ్డింగ్ రిసెప్షన్‌కి వచ్చినవారంతా ఆశ్చర్యపోయారు. గేబ్, అంబిర్ ప్రస్తుతం హాలీవుడ్‌లో స్టంట్ మాస్టర్స్‌గా పనిచేస్తున్నారు. అందుకే ఇంత అలవోకగా... ఎటువంటి బెరుకు లేకుండా ఆ స్టంట్ కానిచ్చేశారు. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ రస్ పావెల్ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.



Also Read: North Korea: ఉత్తర కొరియాలో డేంజర్ బెల్స్... దేశంలో తొలి కోవిడ్ మరణం... 3.50 లక్షల మందిలో జ్వర లక్షణాలు..


Also Read: Rahu Transit 2022 Effects: రాహువు సంచారంలో ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.