Rahu Transit 2022 Effects: జోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహువును ఛాయా గ్రహం లేదా పాప గ్రహం అంటారు. రాహువు సూర్యచంద్రులతో శత్రుత్వం కలిగి ఉంటాడని ప్రజల విశ్వాసం. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం సంభవించే సమయంలో రాహువు ముఖ్యమైన పాత్ర పోషిస్తాడని నమ్ముతారు. ఒక వ్యక్తి తన జాతకంలో కాల సర్ప దోషం, పితృ దోషం, జారత్వ దోషం, అంగారక యోగం మొదలైన వాటికి రాహువే కారణమని జోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే జాతకంలో రాహువు ప్రవేశిస్తే వారికి అశుభమని తెలుస్తోంది.
భరణి నక్షత్రంలో రాహువు సంచారం
పంచాంగం ప్రకారం.. రాహువు ప్రస్తుతం కృత్తిక నక్షత్రంలో ఉన్నాడు. ఇది మేష రాశి కింద వస్తుంది. రాహువు జూన్ 14, 2022న మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఈ రాశిలోని నాల్గవ పాదంలో కదులుతుంది. ఈ రాశి వారికి అధిపతి కుజుడు.
మేష రాశి
రాహువు సంచారం కొన్ని సందర్భాలలో మేష రాశి వారికి శుభం కాదు. రాహువు గత 12 ఏప్రిల్ 2022 నుండి మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు రాహువు రాశి మారబోతోంది. రాహువు జూన్ 14, 2022 నుండి భరణి నక్షత్రం యొక్క నాల్గవ పాదంలోకి ప్రవేశిస్తాడు. దీనికి అధిపతి కుజుడు. కుజుడు మేష రాశికి అధిపతి కూడా. అంగారకుడితో రాహువుకు ఎలాంటి సంబంధం ఉన్నా శుభ ఫలితాలు లభించవు.
రాహువు సంచారం కారణంగా జీవితంలో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు కష్టపడాల్సి వస్తుంది. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు ఉండవచ్చు. ఈ సమయంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చూడాలి. ఆరోగ్యం, డబ్బు విషయంలో కూడా జాగ్రత్త అవసరం.
కర్కాటక రాశి
ఈ రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడికి రాహువుతో బలమైన శత్రుత్వం ఉంది. అందుకే మీరు కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. జూన్‌లో డబ్బు సంబంధిత సమస్యలను పెంచవచ్చు. మానసిక ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలు కూడా పెరగవచ్చు.
రాహువు నివారణ చర్యలు..
రాహువు ప్రశాంతంగా ఉండాలంటే శనివారం నాడు ఉపవాసం ఉండి నియమాలు పాటించాలి. రాహువు శివ భక్తులకు ఇబ్బంది కలిగించడు. రాహువు శివునికి గంట, దాతురాను సమర్పించడం ద్వారా కూడా సంతోషిస్తాడు. ఈ మంత్రాన్ని (రాహు మంత్రం) ప్రతిరోజూ జపించాలి- ఓం రామ్ రాహవే నమః.
ALso Read: Horoscope Today May 13 2022: రాశి ఫలాలు.. ఇవాళ ఆ రాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది..
Also Read: Budhwa Mangal: జ్యేష్ఠ మాసంలో హనుమాన్‌ని పూజిస్తే అద్భుత ఫలితాలు..అవి ఏంటో తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook