Viral Video: వృద్ధురాలి కోసం రోడ్డు మొత్తం బ్లాక్ చేసిన యువకుడు- వీడియో వైరల్!

Viral Video: తరచూ వాహనాలతో రద్దీగా ఉండే రోడ్లను దాటేందుకు చాలా మంది దివ్యాంగులు, వృద్ధులు అనేక కష్టాలు పడుతున్నారు. అలాంటి ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ వృద్ధురాలు రోడ్డు దాటేందుకు ఓ యువకుడు ఏకంగా రోడ్డుపై వాహనాలను నిలిపేశాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 10, 2022, 08:18 PM IST
Viral Video: వృద్ధురాలి కోసం రోడ్డు మొత్తం బ్లాక్ చేసిన యువకుడు- వీడియో వైరల్!

Viral Video: ప్రస్తుతం బిజీ బిజీ లైఫ్ కారణంగా చాలా మంది హడాహుడిగా ప్రవర్తిస్తుంటారు. ఉదయాన్నే ఆఫీస్ లేదా ఇతర పనులకు వెళ్లాలని.. సాయంత్రం ఇంటికి తొందరగా వెళ్లాలని తొందరపడుతుంటారు. అలా చాలా మంది రోడ్లపై వాహనాలపై శరవేగంగా వెళ్తుంటారు. అలాంటి సమయంలో రోడ్డు దాటేందుకు చాలా మంది వికలాంగులు, వృద్ధులు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటారు. అలాంటి ఓ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అలా రోడ్లు దాటే వారికి చాలా మంది కూడా సహాయం చేస్తుంటారు. అయితే వీడియో ప్రకారం.. ఓ వృద్ధురాలు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, ఆమె రోడ్డు దాటేందుకు గ్యాప్ లేకుండా వాహానాలు దూసుకొస్తున్నాయి. దాన్ని గమనించిన ఓ కుర్రాడు.. తన బైక్ ను రోడ్డుకు అడ్డంగా ఉంచి.. వాహనాలను ఆపేశాడు. 

దీంతో ఆ వృద్ధురాలు ఎలాంటి భయాందోళనలు లేకుండా రోడ్డు దాటేసింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వృద్ధురాలు రోడ్డు దాటేందుకు సహాయం చేసిన ఆ యువకుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Also Read: Rare Video: అద్భుతం.. మేఘాలను తాకుతున్న అలలు.. వైరల్ వీడియో!

Also Read: Viral Video: పాల కోసం పిల్లి ఎంత పని చేసిందో మీరే చూడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News