Viral Video: వీడి మామూలోడు కాదు భయ్యా... ఏకంగా కొండచిలువలను భుజాలపై వేసుకుని మరీ డ్యాన్స్ చేశాడు! వీడియో వైరల్
Viral Video: మనం రోజూ నెట్టింట ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని షాక్ గు గురిచేస్తాయి. అలాంటి షాకింగ్ వీడియో గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
Man Dancing With 2 Giant Pythons On His Shoulders: సోషల్ మీడియాలో (Social Media) రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు మనకు నవ్వు తెప్పిస్తే..మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇందులో జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయి. కొండ చిలువలు గురించి మనం అందరికే తెలిసిందే. ఇవీ పెద్ద పరిమాణంలో ఉంటాయి. కానీ వీటిలో విషం ఉండదు. అయినప్పటికీ ఇవీ మనుషులను అమాంతం మింగేయగలవు. సాధారణంగా ఈ పైథాన్‌లు 20 అడుగుల గంటే ఎక్కువ పెరుగుతాయి. వీటిని చూస్తేనే మనం భయంతో వణికిపోతాం. అలాంటిది ఓ రెండు పెద్ద కొండచిలువలను మెడలో వేసుకుని ఓ వ్యక్తి డ్యాన్స్ చేశాడు. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. మీరు ఓ లుక్కేయండి మరి.
వీడియో ఓపెన్ చేస్తే... ఇందులో ఓ వ్యక్తి రెండు భారీ రెటిక్యులేటెడ్ పైథాన్‌లను (reticulated pythons) తన మెడలో వేసుకుంటాడు. పాముల తలలు అతడి వీపువైపు ఉంటాయి. తోకలు మాత్రం ముందువైపు ఉంటాయి. ఆ రెండింటినీ మోస్తూ ఆ వ్యక్తి డ్యాన్స్ చేస్తాడు. అంతపెద్ద కొండచిలువలను మోస్తూ డ్యాన్స్ చేయడం మామూలు విషయం కాదు. అతగాడి ధైర్యానికి నెటజన్లు ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అతడి చేసిన సాహాసాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వరల్డ్- ఆఫ్- స్నేక్స్ (World- of- snakes) అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటివరకు 3.7 మిలియన్ల మంది వీక్షించారు. 44వేలకుపైగా లైక్‌లు వచ్చాయి.
Also Read: Snake Yoga Video: ప్రాణాయామం చేస్తున్న కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మడం పక్కా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook