Runnig Leopard jumps air and catchs deer: జింకను చిరుత పులి ఎలా వేటాడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జింకను ఛేజ్ చేసేందుకు చిరుత వాయు వేగంతో దూసుకెళ్తుంది. ఒక్కోసారి సునాయాసంగానే చిరుతకు జింక చిక్కినా.. మరికొన్ని సార్లు పరిస్థితి తారుమారు అవుతుంది. నిజానికి చిరుత కంటే వేగంగా జింక పరుగెత్తలేదు. కానీ పరుగెత్తుతూ ఒక్కసారిగా గాల్లోకి ఎగరడం, దిశను మార్చుకుని పరుగెత్తడం వల్ల జింక ప్రాణాలతో బయటపడుతుంది. అలాంటి ఘటనే తాజాగా జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ చిరుత పులి అడవిలో జింకల గుంపును తరుముతుంటుంది. పెద్ద సంఖ్యలో ఉన్న జింకల గుంపు పొదల్లోంచి పరుగెత్తుకుంటూ చిరుత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి. వాయు వేగంతో పరుగెత్తిన చిరుత.. ఓ జింకను పట్టుకోబోతుంది. ఆ సమయంలో జింక గాల్లోకి ఎగరగా.. చిరుత కూడా గాల్లోనే ఉండి దాన్ని పట్టేస్తుంది. అయితే కిందపడ్డాక పట్టు కోల్పోయిన చిరుత దాన్ని వదిలేయడంతో.. జింక తప్పించుకుపోయింది.


జింకను చిరుత పులి వేటాడే అనేక వైరల్ వీడియోలను సోషల్ మీడియాలో మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ చిరుత గాలిలో ఎగురుతూ జింకలను వేటాడడంతో ఈ వీడియో కాస్త ప్రత్యేకంగా నిలిచింది. ఇందుకు సంబందించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 'ఫ్లైయింగ్ క్యాచ్.. లైఫ్ అండ్ నేచర్' అని కాప్షన్ ఇచ్చారు. 


చిరుత గాలిలో ఎగురుతూ జింకలను వేటాడడం చుసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను అందరూ షేర్ చేస్తున్నారు. ఇప్పటికే 42 వేల వ్యూస్ వచ్చాయి. ఇక ఈ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'వావ్.. వాట్ ఏ ఛేజ్', 'తెలివైన జింక' అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇక ఆలస్యం ఎందుకు మీరూ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. 



Also Read: Snake Bite: బీసీ హాస్టల్‌లో పాము కలకలం.. ముగ్గురు విద్యార్ధులను కాటేసిన కట్లపాము! ఒకరు మృతి!!


Also Read: Virat Kohli 100th Test: విరాట్ కోహ్లీ స్పెషల్ 'సెంచరీ'.. ప్ర‌త్యేక మెమెంటో అందించిన రాహుల్ ద్రవిడ్‌ (వీడియో)!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook