Google Trending Videos: మనుష్యుల నిర్లక్ష్యం ఓ చిరుతపులి పిల్లకు ప్రాణాంతకంగా మారింది. ప్లాస్టిక్ కంటైనర్‌లో తలదూర్చి రెండ్రోజులపాటు నరకయాతన పడింది. ఆ వీడియో ఓసారి చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది మహారాష్ట్ర థానే జిల్లాలోని  బద్లాపూర్ అటవీ ప్రాంతంలో జరిగింది. ఓ చిరుత పులి పిల్ల పొరపాటున ఓ ప్లాస్టిక్ కంటైనర్‌లో తల దూర్చేసింది. పెను సవాలుతో కూడిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో అటవీశాఖ అధికారులు, వాలంటీర్లు, గ్రామస్థులు స్వచ్ఛంధంగా పాల్గొన్నారు. అతికష్టంగా సంక్లిష్టంగా 48 గంటల సమయం తరువాత ఆ చిరుతకు ప్లాస్టిక్ కంటైనర్ నుంచి విముక్తి లభించింది. కంటైనర్‌లో తల చిక్కుకుపోవడంతో శ్వాసకు, ఆహారానికి, నీటికి రెండ్రోజులపాటు ఇబ్బంది పడింది ఆ చిరుత పులి పిల్ల. 


వాస్తవానికి మొన్న ఆదివారం అంటే ఫిబ్రవరి 13వ తేదీ రాత్రి థానే జిల్లాలోని బద్లాపూర్ గ్రామంలో ప్లాస్టిక్ కంటైనర్‌లో తల ఇరుక్కుపోయిన చిరుత పులి పిల్ల కన్పించింది. ఓ కారులోంచి వీడియో తీశాడు. చిరుత పులి పిల్లను రక్షించేందుకు ప్రయత్నించాడు. అటవీ శాఖాధికారులు అక్కడికి చేరుకునేలోగా..అడవిలో వెళ్లిపోయింది. ఆ తరువాత అటవీ శాఖ అధికారులు, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ , వైల్డ్‌లైఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, గ్రామస్థులు అక్కడికి చేరుకుని..రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. పెట్రోలింగ్ నిర్వహించారు. దాదాపు 30 మంది అడవిలో ఆ చిరుత పులి పిల్ల కోసం అణ్వేషణ ప్రారంభించారు.



ఒకవేళ ఆ చిరుత పులి పిల్ల నివాస ప్రాంతాల్లో ప్రవేశిస్తే..చుట్టూ పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టుకోవడం చాలా కష్టంగా మారుతుందనే ఆందోళన నెలకొంది. అయితే మంగళవారం అంటే 15వ తేదీ రాత్రి ఆ చిరుతపులి పిల్ల బద్లాపూర్ గ్రామంలో కన్పించిందంటూ ఫోన్ వచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. స్పృహ కోల్పోయిన తరువాత నెమ్మదిగా ప్లాస్టిక్ కంటైనర్‌ను తొలగించారు. 24-48 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచాలని అధికారులు చెప్పారు. ఎట్టకేలకు 48 గంటల పాటు తాగునీటికి, శ్వాసకు, ఆహారానికి ఇబ్బంది పడిన చిరుత పులి(Leopard) పిల్లకు విముక్తి లబించింది.



Also read: Viral Video: పెళ్లి కూతురు ముస్తాబు చూసి నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook