Snake Jumped on a Man from the Ceiling Fan: ఈ భూమ్మిద ప్రమాదకరమైన వాటిల్లో పాము కూడా ఒకటి. అయితే కొందరు ఈ పాములను చూసి భయపడితే.. మరికొందరు వాటిని ప్రేమిస్తారు. ఇంకొందరు అయితే వాటిని పెంపుడు జంతువులుగా కూడా పెంచుకుంటారు. పాముల్లో కొన్ని కుడితే క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతాం. కింగ్ కోబ్రా, కట్లపాము, నాగుపాము మెుదలైనవి అన్న మాట. చాలా మంది స్నేక్ క్యాచర్స్ తమ ప్రాణాలను తెగించి మరి ఈ పాములను పట్టుకుంటారు. కొందరు ఈ పాము కాటుకు బలైపోతారు కూడా. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి వీడియో క్షణాల్లో వైరల్ అయిపోతుంది. మనుషుల కంటే జంతువులు, పాములు వీడియోలే ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఓ పాము వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో ఓపెన్ చేస్తే.. ఓ పాము సీలింగ్ ఫ్యాన్ కు చుట్టుకుని ఉంటుంది. ఇంతలో ఓ వ్యక్తి ఫ్యాన్ వేస్తాడు. ఫ్యాన్ తోపాటు అది కూడా తిరుగుతూ ఉంటుంది. పాము తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికి దాని వీలు కాదు. ఈ క్రమంలో ఫ్యాన్ రెక్కల్లో ఒకటి పాముకు తగులుతుంది. దీంతో ఒక్కసారిగా దానిపై నుంచి కిందకు దూకుతుంది. దీంతో వీడియో తీస్తున్న వ్యక్తి షాక్ కు గురవుతాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వేలకొద్ది లైక్ లు, మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తున్నాయి. అంతేకాకుండా ఈ  వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 


Also Read:  king cobra with hood: పడగవిప్పి నిటారుగా నిలబడిన నాగు పాము



ఈ వీడియోను చూస్తేనే గుండెలు జలదరిస్తున్నాయి. అదే ఇలాంటి పాము మీద పడితే ఏమైనా ఉందా.. మన ఫ్యూజులు ఎగరపోవడం పక్కా. పామును చూసి కూడా అతడు వీడియో తీసిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాలి. పాములను హ్యాండిల్ చేసేటప్పుడు చాలా కేర్ పుల్ గా చేయాలి. లేకపోతే మీరు ప్రాణాలు కోల్పోవల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనలు మీ ఇంట్లో జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. 


Also Read: Trending video: వాటర్ బాటిల్ తో ఉడుత దాహం తీర్చిన వ్యక్తి.. వైరల్ అవుతున్న వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook