ప్రతిరోజూ ఇంటర్నెట్ ప్రపంచంలో వందలాది వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. ఇందులో జంతుజీవాలు, పాములకు సంబంధించిన వీడియోలు వేగంగా స్ప్రెడ్ అవుతుంటాయి. ఇప్పుడు ఓ కుక్క, పిల్లి వీడియో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా పిల్లి వర్సెస్ కుక్క ఫైటింగ్ దృశ్యాలే ఎక్కువగా కన్పిస్తాయి. ఈ రెండింటి మధ్య స్నేహం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అలాంటిది ఏకంగా ఏ పిల్లి పిల్లను కాపాడేందుకు కుక్క చేసిన ప్రయత్నం..కుక్క యూనిక్ ఐడియా అందర్నీ ఆకట్టుకుంటోంది. సహజంగానే కుక్క, పిల్లి వీడియోలు నెట్ ప్రపంచంలో వైరల్ అవుతుంటాయి. ఈ వీడియో చూస్తే కచ్చితంగా నవ్వుకుంటారు. అందరితో షేర్ చేసుకుంటారు. అంతగా ఆకర్షించే కంటెంట్ ఉంది ఈ వీడియోలో. చిన్న పిల్లి పిల్లను కాపాడేందుకు ఓ కుక్క ప్రదర్శించిన తెలివితేటలు ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచాయి.



ఓ అటవీ ప్రాంతం మధ్యంలో చిన్న నీటి ప్రవాహం వెళ్తుంటుంది. ఈ ప్రవాహం మధ్యలో ఓ రాయిపై నిలబడి..ఎటు వెళ్లాలో తెలియక దిక్కులు చూస్తుంటుంది ఓ పిల్లి పిల్ల. నీటిలో దిగితే మునిగిపోతుంది. ఆ ప్రవాహాన్ని ఎలా దాటాలో తెలియక ఆలోచిస్తుంటే..ఓ కుక్క తెలివితేటలతో ఆ పిల్లిని కాపాడుతుంది. ఓ చెక్కముక్కను తీసుకొచ్చి ఆ ప్రవాహంపై వంతెనలా పరుస్తుంది. దాంతో ఆ పిల్లి పిల్ల హాయిగా బల్లపై నడుచుకుంటూ..ఆ నీటీ ప్రవాహాన్ని దాటేస్తుంది. 


ట్విట్టర్ వేదికగా షేర్ అయిన ఈ వీడియో ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ దాటేసింది. పెద్దఎత్తున లైక్స్, కామెంట్లు వచ్చిపడుతున్నాయి. షేరింగ్ కూడా ఎక్కువగా ఉంది.


Also read: Aeroplane On Truck: విమానంతో రోడ్డెక్కిన భారీ ట్రక్కు.. వీడియో వైరల్.. బాప్‌రే ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook