Aeroplane On Truck: విమానంతో రోడ్డెక్కిన భారీ ట్రక్కు.. వీడియో వైరల్.. బాప్‌రే ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా ?

Aeroplane Carried On Truck: కేరళ నుంచి హైదరాబాద్‌కి ట్రక్కులో తరలిస్తున్న ఈ విమానం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్ అయింది. ప్రత్యక్షంగా చూసే వారికైతే ఇక పెద్ద వినోదంగానే మారింది. ఇంతకీ ఈ విమానం ఎక్కడిది ? హైదరాబాద్‌కి ఎందుకు తరలిస్తున్నారో తెలియాలంటే ఇదిగ ఈ డీటేల్డ్ స్టోరీ చదవాల్సిందే. 

Written by - Pavan | Last Updated : Nov 11, 2022, 09:05 PM IST
  • ఇంతకీ ఈ విమానం ఎక్కడిది ? హైదరాబాద్‌కి ఎందుకు తరలిస్తున్నారు ?
  • రెస్టారెంట్ ఓనర్ విమానం ఎందుకు కొన్నాడు
  • కేరళ నుంచి ఈ ట్రక్కు హైదరాబాద్ చేరడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా ?
  • ఫుల్ డీటేల్స్ కోసం ఈ ఆసక్తికరమైన కథనం చదవండి
Aeroplane On Truck: విమానంతో రోడ్డెక్కిన భారీ ట్రక్కు.. వీడియో వైరల్.. బాప్‌రే ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా ?

Aeroplane Carried On Truck: వివిధ పరిశ్రమలకు చెందిన భారీ భారీ పరికరాలను, బాయిలర్లను, పరిశ్రమల విడిభాగాలను, ట్రాన్స్‌ఫార్మర్స్‌ని అంతకంటే భారీ సైజు ఉండే ట్రక్కులు రోడ్లపై మోసుకెళ్తుండటం అప్పుడప్పుడూ నేరుగానో లేదా వీడియోల్లోనో చూసే ఉంటారు. అలాంటి వీడియోలకు బాప్ ఇది. అవును మరి.. విమానాలను ఎయిర్ పోర్టులోనో లేక గాల్లో ఎగరడం మాత్రమే చూసే మనకు అది ఏకంగా రోడ్డు ఎక్కడం చూస్తే ఏమనిపిస్తుందో చెప్పండి. అది కూడా ఆ విమానాన్ని ఓ భారీ ట్రక్కు మోయలేక మోయలేక ఈసురోమని మోసుకెళ్తుంటే చూడ్డానికి ఆ దృశ్యం ఇంకెలా ఉంటుందో చెప్పండి. ఏంటి విమానం రోడ్డెక్కిందా .. అది కూడా ట్రక్కుపైకెక్కిందా అని ఆశ్చర్యపోకండి.. ఎందుకంటే ఈ ఘటన వెనుక ఆసక్తికరమైన విషయాలు ఇంకెన్నో ఉన్నాయి మరి.

కేరళ నుంచి హైదరాబాద్‌కి ట్రక్కులో తరలిస్తున్న ఈ విమానం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్ అయింది. ప్రత్యక్షంగా చూసే వారికైతే ఇక పెద్ద వినోదంగానే మారింది. కేరళలో కంటపడిన ఈ వీడియోను అక్కడి స్థానిక మీడియా మనోరమ తమ యూట్యూబ్లో అప్‌లోడ్ చేసింది. 

ఇంతకీ ఈ విమానం ఎక్కడిది ? హైదరాబాద్‌కి ఎందుకు తరలిస్తున్నారు ?
ఎయిర్ ఇండియాకు చెందిన A320 ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్ బస్‌కి విమానయానంలో సేవలు ముగిశాయి. ప్రతీ వాహనానికి ఒక ఎక్స్‌పైరీ పీరియడ్ ఉంటుంది కదా.. అలాగే ఈ విమానానికి కూడా వయసైపోయిందన్నమాట. ఎయిర్ ఇండియా వారు ఈ విమానాన్ని వేలం వేసి అమ్మేయగా హైదరాబాద్‌కి చెందిన ఓ రెస్టారెంట్ ఓనర్ కొనుగోలు చేశాడు. ఈ విమానం కేరళలోని త్రివేండ్రంలో ఉండటంతో రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కి తరలిస్తున్నారు. 

రెస్టారెంట్ ఓనర్ విమానం ఎందుకు కొన్నాడు 
హైదరాబాద్‌లో ఎయిరోప్లేన్ థీమ్ రెస్టారెంట్ నిర్వహించే ఆలోచనతో సదరు రెస్టారెంట్ ఓనర్ ఈ విమానాన్ని వేలంలో కొనుగోలు చేశాడు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ ఇలాంటి థీమ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే త్రివేండ్రం నుంచి హైదరాబాద్ వస్తుండగా కొల్లాం జిల్లాలో ట్రక్కు ఓ బ్రిడ్జిని దాటే క్రమంలో చాలా సమయమే పట్టింది. భారీ వాహనం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జనం కూడా భారీ సంఖ్యలో తరలివచ్చి ట్రక్కుపై ఉన్న విమానాన్ని చూసేందుకు ఎగబడ్డారు. అందులోనూ మారుమూల పల్లె ప్రాంతంలో అంత పెద్ద విమానం తమ కళ్ల ముందు అంత దగ్గరిగా దర్శనం ఇవ్వడంతో జనం ఆ విమానాన్ని అలా చూస్తూ ఉండిపోయారు. ఇంకొంతమంది సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. 

ఎన్ని రోజులు పడుతుందో తెలుసా ?
విమానం రెక్కలు, వెనుక తోక భాగం, ముందు ముక్కు భాగం తొలగించేశారు. వాటితో విమానాన్ని ట్రక్కుపైకి ఎక్కించడం, రోడ్డుపై తరలించడం అసాధ్యం కనుక ముందే ఆ భాగాలను తొలగించి కేవలం మెయిన్ బాడీని మాత్రమే ట్రక్కుపైకి ఎక్కించారు. ఈ ట్రక్కు త్రివేండ్రం నుంచి హైదరాబాద్ చేరాలంటే కనీసం నెల రోజులు పడుతుందని సమాచారం. ఇలాంటి భారీ పరికరాలను, యంత్రాలను ట్రక్కులపై తరలించడానికి ఎంతో నైపుణ్యం కలిగిన లాజిస్టిక్స్ కంపెనీలు ఉంటాయి. గతేడాది కూడా ఇలాగే ఢిల్లీలో ఒక విమానాన్ని ట్రక్కులో తరలిస్తుండగా ఢిల్లీ - గురుగ్రామ్ హైవేపై ఓ బ్రిడ్ది కింద ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే.

Also Read : Business Ideas: 2 నెలల కోర్సు చేసి ఏడాదికి 18 లక్షలు సంపాదిస్తున్నాడు

Also Read : SBI Custmoers Alert: ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. మీకూ ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయా ?

Also Read : Monkey Viral Video: సబ్బు పెట్టిమరీ.. బట్టలు ఉతుకుతున్న కోతి! రన్నింగ్ కామెంటరీ వింటే నవ్వాగదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News