Pan Slapping Video: ఇంటర్నెట్‌లో ఇటీవల ఓ విచిత్రమైన వీడియో వైరల్ అవుతోంది. పాన్ స్లాపింగ్ కంటెస్ట్ ఆడుతున్న వీడియో అది. గూబ గుయ్యిమనేలా కొట్టుకుంటున్న దృశ్యమది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్నెట్ ప్రపంచమంటేనే విచిత్ర వీడియోలు, ఫోటోలతో నిండి ఉంటుంది. ఎప్పుడు ఏ వీడియో ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. అటువంటిదే ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో పాన్ స్లాపింగ్ కంటెస్ట్ జరుగుతోంది. చుట్టూ జనం మధ్య ఇద్దరేసి పోటీదారులు ఆడుతున్న ఆట వీడియో ఇది. 


పాన్ స్లాపింగ్ కంటెస్ట్ ఏంటనుకుంటున్నారా..ఏమీ లేదు కుకింగ్ పాన్ తీసుకుని ఎదురెదురుగా కూర్చుంటారు. ఒకరి గూబ మరొకరు గుయ్యిమనేలా పాన్‌తో కొట్టుకునే ఆట ఇది. కర్ణభేరి పగిలి రక్తం కారుకుని చచ్చిపోతారనుకుంటున్నారు కదా..ఆ ప్రమాదం లేకుండా హెడ్ అండ్ ఇయర్స్ కవర్ అయ్యేలా ప్రత్యేకమైన హెల్మెట్ ఉంటుంది. ఇద్దరిలో ఎవరో ఒకరు కింద పడిపోవాలి. అప్పటి వరకూ ఒకరి తరువాత మరొకరు గూబ గుయ్యిమన్పించేలా కొట్టుకుంటారు.



ఈ వీడియో షేర్ కాగానే ఇంటర్నెట్‌లో వైరల్ అయిపోతోంది. ఇప్పటికే 2 మిలియన్ల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వేలాది లైక్స్ వచ్చి పడుతున్నాయి. ఇదే ఆటను కొన్ని ప్రాంతాల్లో స్లాప్ ఫైటింగ్‌గా ఆడుతుంటారు. అంటే లెంపకాయలు కొట్టుకునే ఆట. అంటే ఇందులో కుకింగ్ పాన్ స్థానంలో అరచేయి ఉంటుంది. సరే ఏది ఎలా ఉన్నా ఈ పాన్ స్లాటింగ్ కంటెస్ట్ వీడియో మాత్రం బాగా వైరల్ అవుతోంది. త్వరలో ఈ గేమ్ ప్రాచుర్యం పొందుతుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కూడా.


Also read: Peacock Viral Video: ఎగిరే నెమలిని ఎప్పుడైనా చూశారా, ఆ అందం చూసేందుకు రెండు కళ్లు చాలవు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.