Girl Falling In Swimming Pool: హృదయాన్ని కదిలించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ చిన్నారి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆడుకుంటోంది. ఆ సమయంలో ఆ చిన్నారి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోతుంది. ఆ తరువాత ఏం జరిగిందో చూస్తే మీరే షాకవుతారు. చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా  ఉండాలన్న విషయం అందరికి తెలిసిందే.. రెప్ప పాటులో చేసే అజాగ్రత్తలు పిల్లల ప్రాణాలకే ముప్పుగా మారే అవకాశం లేకపోలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్విమ్మింగ్ పూల్ లో పడిన చిన్న పాప 
చిన్నపాటి నిర్లక్ష్యాలే పిల్లల ప్రాణాలని బలితీసుకుంటుంది.. దీనికి సంబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక చిన్న పాప తన ఇంట్లో ఆడుకుంటూ ఉంటుంది.. ఆడుకుంటూ ఇంట్లో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ దగ్గరకి వెళ్లటం మనం వీడియోలో చూడవచ్చు.. ఆ చిన్న పాప ఆడుకుంటూ.. ఆడుకుంటూ పూల్ దగ్గరకి వెళ్లటం... నీటిని చూసిన ఉత్సాహంలో ఆ బాలిక స్విమ్మింగ్ పూల్‌లో మోకాళ్లపై దిగడం మనం చూడవచ్చు. 


మోకాలితో దిగటానికి ప్రయత్నించిన ఆ పాప ఒక్కసారిగా ఆ నీటిలో పడిపోవటం మనం గమనించినచ్చు.. నీటిలో పడిన వెంటనే ఆ పాప కాళ్లు చేతులు ఆడిస్తూ... పడే నరకయాతన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. అదృష్టవశాత్తు పాప తండ్రి పరిగెత్తుకు వచ్చి ఆ పూల్ లో దుకాటం చూడవచ్చు. 


ఒక్క క్షణం ఆలస్యమైన పాప ప్రాణం పోయేది.. 
పూల్ లో దూకిన పాప తండ్రి వెంటనే పాపను చేత్తో పట్టుకొని నీటిలో నుండి తీయటం మనం వీడియోలో చూడవచ్చు. పాప తండ్రి కానీ కాస్త ఆలస్యంగా వచ్చినా... ఆ పాప ప్రాణం చూస్తుండగానే గాల్లో కలిసిపోయేది. క్షణం పాటు మనం చేసే నిర్లక్ష్యమే వారి పాలిట మృత్యు శాపంగా మారవచ్చు. పాప తండ్రి సమయానికి రావటంతో పాప ప్రాణాలతో బయటపడింది. 


మన ఇళ్లలో ఉండే చిన్న పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. వారిని ఒంటరిగా వదిలేయకుండా.. వారు ఎక్కడున్న ఓ కంట కనిపెట్టడం మంచిది.. ఎల్లపుడు వారిని  పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ వీడియో ద్వారా మనకు తెలుస్తుంది. 



Also Read: Educational TV Channels: స్టూడెంట్స్ కోసం 200 ఎడ్యుకేషనల్ టీవీ ఛానెల్స్
Also Read: Garapati Sambasiva Rao : మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు కన్నుమూత..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook