Educational TV Channels: స్టూడెంట్స్ కోసం 200 ఎడ్యుకేషనల్ టీవీ ఛానెల్స్

200 TV Channels for Students "ప్రధాన మంత్రి ఈ విద్య" స్కీమ్‌లో భాగంగా విద్యార్థుల కోసం 200 ఎడ్యుకేషనల్ టీవీ ఛానెల్స్ రానున్నాయి. 1 నుంచి 12వ తరగతి చదివే వారందరికీ ఈ ఛానెల్స్ ఉపయోగకరంగా మారనున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2022, 03:02 PM IST
  • విద్యార్థులకు డిజిటల్‌ విద్యను మరింత బలోపేతంగా అందించనున్న కేంద్ర ప్రభుత్వం
  • వన్‌ క్లాస్‌.. వన్‌ టీవీ ఛానెల్‌ కార్యక్రమంలో విస్తరించనున్న సర్కార్
  • 12 ఛానెల్స్‌ను 200కు పెంచేందుకు నిర్ణయం
Educational TV Channels: స్టూడెంట్స్ కోసం 200 ఎడ్యుకేషనల్ టీవీ ఛానెల్స్

Digital Education: ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది. ఇలాంటి తరుణంలో విద్యార్థులకు డిజిటల్‌ విద్యను మరింత బలోపేతంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వన్‌ క్లాస్‌.. వన్‌ టీవీ ఛానెల్‌ (One Class - One TV Channel) కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి 12 ఛానెల్స్‌ను 200కు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా బడ్జెట్‌ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 

దీంతో ఇకపై అన్ని తరగతులకు ఒకేసారి డిజిటల్‌ విద్యాబోధన (Digital Education) జరగనుంది. ఇక దేశంలో ప్రస్తుతం ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు 12 ఛానెల్స్ ద్వారా డిజిటల్‌ తరగతులు కొనసాగుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఒకట్రెండు ఛానెల్స్ ద్వారా మాత్రమే స్టూడెంట్స్‌కు విద్యా బోధన సాగడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ (Central Government) ఛానెల్స్‌ సంఖ్యను 200 దాకా పెంచుతామని చెప్పడంతో ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తోంది. 

ఇక దేశంలో డిజిటల్ యూనివర్సిటీని కూడా నెలకొల్పనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఇక బడ్జెట్‌లో.. విద్యార్థుల కోసం 200 ఎడ్యుకేషనల్ టీవీ ఛానెల్‌లను (Educational TV channel‌s) ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అలాగే దేశంలోనే తొలి డిజిటల్ యూనివర్సిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతోందంటూ ఆయన స్పష్టం చేశారు.

డిజిటల్ యూనివర్సిటీలో పలు ప్రాంతీయ భాషల్లో బోధన ఉండనుంది.  పలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా కూడా అన్ని భాషల్లో ఉత్తమమైన ఈ కంటెంట్‌ను విద్యార్థులకు (Students) అందించేందుకు కేంద్రం ప్రభుత్వం (Central Government) రంగం సిద్ధం చేస్తోంది.

Also Read: Indigo Vaxi Fare: విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇండిగో విమానాల్లో 10 శాతం డిస్కౌంట్!

Also Read: Garapati Sambasiva Rao : మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు కన్నుమూత..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News