Mother's Day 2022: లీనా మదీనా.. ఇప్పటి కాలానికి ఈ పేరు గురించి పెద్దగా తెలియకపోవచ్చు.  కానీ దాదాపు 90 ఏళ్ల కింద ఈ పేరు ప్రపంచాన్నే సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. డాక్టర్లకు సవాలక్ష ప్రశ్నలు తలెత్తేలా చేసింది.  ఇప్పటికీ లీనా మదీనా వైద్యశాస్త్రంలో ఓ మిస్టరీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లీనా మదీనా ఐదేళ్ల వయసులోనే తల్లి అయ్యింది.నమ్మకపోయినా ఇది నిజం. పెరూలోని టిక్రాపోకు చెందిన లీనా 1933 సెప్టెంబర్ 27 న జన్మించింది. చిన్నారికి ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆమె కడుపు పెద్దదికావడం మొదలైంది. కారణం ఏంటో అంతుబట్టని చిన్నారి తల్లిదండ్రులు వైద్యున్ని ఆశ్రయించారు. వైద్యులు కూడా లీనా కడుపులో కణితిలాంటిది ఏదైనా పెరుగుతుందేమోనని భావించారు. తీరా టెస్ట్ రిపోర్టులు వచ్చాక అవాక్కయ్యారు. లీనా కడుపులో బిడ్డ పెరుగుతున్నట్లు గుర్తించారు. విషయం తెలియడంతో చిన్నారి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. 


అంత చిన్న వయసులో లీనా ప్రెగ్నెంట్ కావడం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఇదెలా సాధ్యమని వైద్యశాస్త్రంలోని పుస్తకాలన్నీ తిరగేశారు. అయినా వారికి మాత్రం సమాధానం దొరకలేదు. లీనాతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డను కాపాడటం వైద్యులకు అతిపెద్ద సవాల్‌గా మారింది. దీంతో ఆ చిన్నారిని కంటికి రెప్పలా చూసుకున్నారు. చివరకు లీనా ఐదేళ్ల వయసులో 1939 మే 14 న సిజేరియన్ ద్వారా ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టినప్పుడు ఆ బిడ్డ బరువు 2.7 కిలోలు. అంతచిన్న వయసులో లీనా తన కొడుకును జాగ్రత్తగా చూసుకునేది. ఒక తమ్ముడిలా ఆ చిన్నారిని పెంచింది లీనా. ఐదేళ్ల వయసులో తల్లైన లీనా అప్పట్లో ప్రపంచంలోనే ఓ సెన్సేషన్. చాలా మంది అసలీ విషయాన్ని నమ్మడానికి నిరాకరించేవారు. నమ్మనవాళ్లు ఆశ్చర్యంలో మునిగిపోయేవాళ్లు.


అనంతరం లీనాకు ఎన్నో టెస్టులు నిర్వహించారు డాక్టర్లు. ఆమెకు ప్రికోషియస్ ప్యుబర్టీ అనే సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్య కారణంగా చిన్నవయసులోనే లైంగిక అవయవాలు అభివృద్ధి చెందుతాయి. ఫలితంగా లీనాకు మూడేళ్లకే పీరియడ్స్ రావడం ప్రారంభమైంది. అయినా ఆ వయసులో లీనా ఎలా గర్భవతి అయ్యిందన్న విషయం మాత్రం వైద్యుల మనసును తొలుస్తూనే ఉంది. అయితే దీనికి సమాధానంగా ఓ సాంప్రదాయ పండుగ ముందుకొచ్చింది. లీనా తెగవాళ్లు ప్రతిఏటా ఓ సాంప్రదాయ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా యువతీ,యువకులు శృంగారంలో పాల్గొనేవారు. ఆ పండుగలోనే లీనా ఎవరితోనే లైంగికచర్యలో పాల్గొన్నట్లు తెలిసింది. ఫలితంగా చిన్నవయసులోనే తల్లైంది. అయినా ఆ వయసులో తల్లికావడం, క్షేమంగా బిడ్డకు జన్మనివ్వడం అనేది ఇప్పటికీ వైద్యశాస్త్రంలో ఓ మిస్టరీ.


also read: TSRTC Mothers Day Gift: మాతృమూర్తులకు 'మదర్స్ డే' స్పెషల్ గిఫ్ట్... ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..


also read:  Mystery Tree: సైన్స్‌కి కూడా అంతుచిక్కని రహస్యం..చెట్టు నుంచి ఉబికి వస్తున్న నీరు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.