Heavy Floods: భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌లో వరద బీభత్సం, మార్కెట్లు, ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోతున్న దృశ్యాలు
Heavy Floods: నైరుతి రుతుపవనాల ప్రభావం ఉత్తరాదిలో అత్యంత తీవ్రంగా కన్పిస్తోంది. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Heavy Floods: నైరుతి రుతు పవనాల ప్రబావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కల్గించినా ఉత్తరాది రాష్ట్రాల్లో విపత్తుగా మారింది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వాగులు వంకలు నదీనదాలు ఉధృతంగా ప్రవహిస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వీడియోలు చూస్తే ఉత్తరాది పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు.
హిమాచల్ ప్రదేశ్‌లోని ఆట్ బంజర్‌ను కలిపే వంతెన వరద ధాటికి చూస్తూ చూస్తుండగానే ఎలా కొట్టుకుపోయిందో ఈ వీడియోలో స్పష్టంగా గమనించవచ్చు. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాకు చెందింది. బియాస్ నది ఉధృతిలో వంతెన కొట్టుకుపోవడాన్ని స్పష్టంగా గమనించవచ్చు.
ఇది మరో వైరల్ వీడియో. మండి జిల్లాలో ఒక్కసారిగా విరుచుకుపడిన వరద ధాటికి తునాగ్ ప్రాంతంలోని ప్రధాన మార్కెట్ ఏ విధంగా నాశనమైందో చూడవచ్చు. కొండ ప్రాంతాల్నించి కొట్టుకువచ్చే వరదతో పాటు కలప కూడా కొట్టుకొస్తూ అడ్డొచ్చిన చిన్న చిన్న ఇళ్లను ధ్వంసం చేసుకుంటూ పోతున్న బీభత్స దృశ్యాలు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమంతా ఇదే పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు, వరదల కారణంగా స్కూల్స్ కళాశాలలు ముతపడ్డాయి. కులూ మనాలీ మార్గంలో రోడ్లపై కొండచరియలు, పెద్ద పెద్ద రాళ్లు విరిగిపడటంతో పరిస్థితి భయానకంగా మారింది.
బియాస్ నది ఉధృతంగా ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతోంది. మనాలీ నుంచి అటల్ టన్నెల్, రోహ్తంగ్ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్థంబించాయి. చాలా ప్రాంతాల్లో రైళ్ల రాకపోకల్ని కూడా నిలిపివేశారు.
Also read: Goosebumps Video: అక్కడ అందరూ పాములను మెడకు చుట్టుకొని నదీ స్నానాలు ఆచరిస్తారు..గూస్ బంప్స్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook