Gas Booking: గ్యాస్ సిలిండర్ బుకింగ్ మరింత సులభమవుతోంది. గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారుల కోసం మరింత సులభమైన విధానాన్ని ప్రవేశపెడుతున్నాయి. ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులు ఇకపై వాట్సప్, ఎస్ఎంఎస్ ద్వారా సిలెండర్ బుక్ చేసుకోవచ్చు. ఎలాగంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ ( Lpg Gas Cylender Booking) కోసం గ్యాస్ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు సరళీకృత విధానాల్ని అందుబాటులో తీసుకొస్తున్నాయి. గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకోవడంలో వినియోగదారులకు ఉపయోగపడే రీతిలో సులభమైన పద్ధతుల్ని ప్రవేశపెట్టాయి. ఇకపై వినియోగదారులు వాట్సప్, ఎస్ఎంఎస్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. గత ఏడాది ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులో తీసుకొచ్చిన గ్యాస్ కంపెనీలు..ఇకపై కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాయి. ఎలా బుక్ చేసుకోవాలంటే..


ఇండియన్ గ్యాస్ ( Indian Gas) కస్టమర్లు 7718955555కు కాల్‌ చేసి ఎల్పీజీ సిలిండర్‌ను బుక్‌ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో అయితే 7588888824కు సందేశం పంపించవచ్చు. అదే విధంగా 
హెచ్‌పీ గ్యాస్‌ ( Hp Gas) కస్టమర్లు 9222201122కు వాట్సప్‌ మెసేజ్‌ పంపడం ద్వారా సిలిండర్‌ను బుక్‌ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ నంబర్‌ మరిన్ని సేవా వివరాలను కూడా అందజేస్తుంది. భారత్‌ గ్యాస్ ( Bharat Gas) కస్టమర్లు సిలిండర్లను బుక్‌ చేసుకోవాలంటే తమ రిజిస్టర్‌ మొబైల్‌ నుంచి 1800224344 నంబర్‌కు మెసేజ్‌ చేయాలి. దీని తర్వాత వినియోగదారుల బుకింగ్‌ అభ్యర్థనను గ్యాస్‌ ఏజెన్సీ అంగీకరిస్తుంది. బుకింగ్‌ సమయంలో వినియోగదారులు తప్పనిసరిగా తమ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి మాత్రమే వాట్సప్‌ పంపాలి.  


వాట్సప్‌ ద్వారా గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ ( Whatsapp gas booking) చేసుకునే సౌలభ్యం వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సామాన్య మధ్య తరగతి ప్రజలకు కూడా ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉండటం, వాట్సప్‌ వాడుతుండటంతో ఈ ప్రక్రియ వారికి బాగా దోహదపడుతుంది. ఇప్పటి వరకు ఉన్న పలు విధానాల ద్వారా కొంత ఇబ్బంది కలిగేది. ఇప్పుడు తేలికగా గ్యాస్‌ బుక్‌ చేసుకోవచ్చు. 


Also read: TikTok APP: భారత్ నిషేధించినా నెంబర్ వన్‌గా నిలిచిన టిక్‌టాక్ యాప్ నెంబర్ వన్‌గా నిలిచిన టిక్‌టాక్ యాప్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook