TikTok Downloads: భారతదేశంలో నిషేధం విధించినా టిక్‌టాక్ యాప్ హవా తగ్గడం లేదు. మార్చి నెలలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ అయిన నాన్ గేమింగ్ యాప్‌గా టిక్‌టాక్ నిలిచింది. గాల్వన్ లోయ వివాదం, భారత జవాన్లు అమరులు కావడంతో చైనాపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే వందల కొద్దీ చైనా యాప్‌లను భారత్‌లో నిషేధం విధించారు.
మార్చి నెలలో టిక్‌టాక్ యాప్‌ను 58 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా మార్చి నెలలో అత్యధికంగా డౌన్లోడ్ అయిన నాన్ గేమింగ్ యాప్‌గా టిక్‌టాక్ అగ్రస్థానంలో నిలిచింది. మార్క్ జూకర్‌బర్గ్‌కు చెందిన ఫేస్బుక్ సంస్థ 56 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో రెండో స్థానంలో నిలిచింది. యాప్‌లపై విశ్లేషణ చేసే సెన్సార్ టవర్ ఈ వివరాలు వెల్లడించింది. అత్యధికంగా చైనాలో 11 శాతం మంది టిక్‌టాక్(TikTok App) డౌన్లోడ్ చేసుకోగా, 10 శాతంతో అగ్రరాజ్యం అమెరికా రెండో స్థానంలో ఉందని సెన్సార్ టవర్ తెలిపింది.
ఫేస్బుక్ సంస్థకు చెందిన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసేంజర్ యాప్‌లు నాన్ గేమింగ్ యాప్‌ల డౌన్లోడ్లలో టాప్5లో చోటు దక్కించుకున్నాయి. ఫేస్బుక్ యాప్‌ను అత్యధికంగా 25 శాతం భారత్‌లో డౌన్లోడ్ చేసుకోగా, 8 శాతం డౌన్ లోడ్లతో అమెరికా రెండో స్థానంలో నిలిచింది. స్నాప్‌చాట్, జోష్, జూమ్, టెలీగ్రామ్, క్యాప్‌కట్ వంటి యాప్స్ మొదటి 10 యాప్‌లలో చోటు దక్కించుకున్నాయి.
యూజర్ల డేటా చోరీ, డేటా ప్రైవసీకి భంగం వాటిల్లుతుందని ఆరోపణల నేపథ్యంలోనూ ఫేస్బుక్(Facebook) యాప్ డౌన్లోడ్స్ భారత్‌లో అధికంగా కావడం గమనార్హం. ఇటీవల మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగత వివరాలు సైతం ఆన్లైన్ వేదికగా హ్యాకర్లు, నిపుణులు పోస్ట్ చేయడం తెలిసిందే. షేర్‌చాట్‌కు చెందిన వీడియో ప్లాట్‌ఫామ్ మోజ్ టాప్10లో నిలవగా, గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్నారు.
Also Read: WhatsApp: మొబైల్ మరియు Internet లేకున్నా ఎంచక్కా వాట్సాప్ సేవలు, త్వరలో సరికొత్త ఫీచర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook