Python Climb Tree: భారీ చెట్టును సెకన్లలో ఎక్కేసిన కొండ చిలువ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
Python Climb Tree: ఒక కొండ చిలువ భారీ చెట్టును తోకతో చుట్టేసుకుంది. అంతటితో ఆగకుండా.. తన తోకను ఆధారంగా చేసుకుని ఎత్తుగా ఉన్న చెట్టుమీదకు ఎక్కింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Huge Python Climb Tree Video Goes Viral: సోషల్ మీడియాలో పాముల వీడియోలకున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని వీడియోలు చూస్తే భయంకరంగా ఉంటే, మరికొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యకరంగా కూడా అన్పిస్తుంటాయి. నెటిజన్లు పాముల కంటెంట్ ఉన్న వీడియోలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో తరచుగా వైరల్ కంటెంట్ వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. వీటిలో ముఖ్యంగా పెళ్లిలో జరిగిన ఫన్నీ ఘటనలు వార్తలలో ఉంటాయి. అదే విధంగా.. వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ల వీడియోలు ట్రెండింగ్ లో ఉంటాయి. ఇక జంతువుల దాడులకు సంబంధించిన వీడియోలు కూడా వార్తలలో నిలుస్తున్నాయి. అత్యంత భయంకరమైన పాములతో కూడా కొందరు మెడలో వేసుకుని, కొండ చిలువలను తమ బెడ్ ల మీద వేసుకుని చాలా మంది తరచుగా రీల్స్, వీడియోలు తరచుగా చేస్తుంటారు. పాములకు చెందిన అనేక ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి.
పాములకు సంబంధించిన వెరైటీ స్టోరీస్ లకు నెట్టింట్లో ఫుల్ డిమాంగ్ ఉందని కూడా చెప్పుకొవచ్చు. కొందరుపాములు కన్పిస్తే భయంతో పారిపోయే వారు కొందరైతే, స్నేక్ సోసైటీవారికి సమాచారం ఇచ్చేవారు మరికొందరు. పాములను దైవంగా కూడా కొలుస్తుంటారు. కానీ కొన్నిసార్లు పాములు కాటేయడం వల్ల అమాయకులు చనిపోయిన ఘటనలు కూడా వార్తలలో నిలిచాయి. ప్రస్తుతం మాత్రం అడవిలో ఒక కొండ చిలువ అత్యంత ఎత్తైన చెట్టుమీదకు ఎక్కుతుంది. ఈ వీడియో ట్రెండింగ్ గా మారింది.
సాధరణంగా కొండ చిలువలు ఎంతో బరువుగా ఉంటాయి. పాములంతా వేగంగా ఇవి వెళ్లలేవు. పాములు కాటువేస్తే నిముషాల వ్యవధిలో ప్రాణాలు వదిలి చనిపోతుంటారు. కానీ కొండ చిలువ రూట్ కాస్త డిఫరెంట్. అది తన వేట దగ్గరకు మెల్లగా వెళ్తుంది. ఆతర్వాత ఒక్కసారిగా దాడిచేసి చుట్టేసుకుంటుంది. ఎంతలా అంటే ఎముకలన్ని కూడా పటపట విరిగిపోతాయి. కనీసం శ్వాస కూడా తీసుకొవడానికి అవకాశం ఉండదు. ఆ తర్వాత జీవి లేదా మనిషి పూర్తిగా చలనం ఆగిపోయిందని కన్ఫామ్ చేసుకున్నాక.. కొండ చిలువ మెల్లగా మింగిస్తుంది. కొండ చిలువలు ఆహారం తిన్నాక కొన్నిరోజుల పాటు మరల వేటాడటం చేయవని చెబుతుంటారు.
Read More: Bull Attacks Scooter: వామ్మో.. గంగిరెద్దు ఎంతపనిచేసింది.. షాకింగ్ వీడియో వైరల్..
అవి మెల్లగా వెళ్తుంటాయి. కొండ చిలువల కాటు ప్రమాదంకాదు.. కానీ కొండ చిలువ పట్టుకు చిక్కితేమాత్రం బతికి బట్టకట్డడం కష్టం అని చెబుతుంటారు. అయితే.. ఇక్కడ ఒక కొండ చిలువ తన తోకను ఆధారంగా చేసుకుని ఎత్తైన చెట్టుమీదకు అమాంతం ఎక్కేసింది. చూస్తుండగానే.. సెకన్ల వ్యవధిలోనే భారీగా, ఎత్తుగా ఉన్న చెట్టును ఎక్కేసింది. కల్లుగీత కార్మికుడి కన్నా స్పీడ్ గా చెట్టును కొండ చిలువ ఎక్కేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కొండ చిలువ ముందు కల్గుగీత కార్మికుడు కూడా పనికిరాడని కామెంట్ లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook