Hyderabad Rains: హైదరాబాద్ లో అరుదైన దృశ్యం... ఆరడుగుల ప్రదేశంలో దంచికొట్టిన వాన.. వీడియో వైరల్..
Rains in hyderabad: కొన్నిరోజులుగా హైదరాబాద్ లో జోరుగా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో నగరవాసులు వానల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లే వారికి చుక్కలు కన్పిస్తున్నాయని చెప్పవచ్చు.
6 feet rain fall in muradnagar Hyderabad: కొన్నిరోజులుగా నైరుతి రుతుపవనాలు దేశంలో చురుకుగా విస్తరించాయి. మరోవైపు ఉపరిత ద్రోణి ప్రభావం కూడా దీనికి తోడవ్వడంతో రాష్ట్రంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. తెలంగాణలో గత కొన్నిరోజులుగా వానలు జోరుగా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్లన్ని జలమయపోయాయి. లోతట్టు ప్రాంతాలన్ని నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో వానల వల్ల ఇళ్ల నుంచి బైటకు వెళ్లేందుకు జనాలు కూడా జంకుతున్నారు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో.. మరేక్కడ నాలాలున్నయో కూడా తెలవని పరిస్థితి నెలకొంది.
అంతేకాకుండా.. రోడ్లలోని గుంతలలో నీళ్లుచేరి ఉండటం వల్ల ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. మనం తరచుగా వానలు కురుస్తున్నప్పుడు ఒక వింత అనుభవం చూస్తుంటాం. ఒక ప్రదేశంలో జోరుగా వానకురుస్తుంటే.. మరోచోట.. చుక్క వర్షం కూడా పడదు. కొన్నిసార్లు ఒకే ఏరియాలో.. ఒక వైపు వర్షం పడితే.. మరోవైపు అస్సలు వర్షం పడదు.ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తివివరాలు..
హైదరాబాద్ లో ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో అంత ఈజీగా అర్థం కాదు. అప్పుడు ఎండలు దంచికొడుతుంటాయి. మరీ కాసేపటికే కుండపోతగా వానలు కూడా పడుతుంటాయి.అంతేకాకుండా.. కొన్నిచోట్ల జోరుగా వానలు పడుతుంటే.. పక్క ఏరియాలో ఎండకోడుతుంటుంది.ఇలాంటి భిన్నమైన వాతావరణంను మనం తరచుగా చూస్తుంటాం. ఇలాంటి భిన్నమైన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
హైదరాబాద్‌లోని మురద్‌నగర్ పోస్టాఫీస్ సమీపంలో ఈ అందమైన దృశ్యం చోటుచేసుకుంది. ఒక గల్లీలో ఒకవైపు మాత్రమే వర్షం పడుతుండగా.. మరో వైపు ఒక చుక్క వర్షపు నీరు కూడా పడకపోవడాన్ని వీడియోలో చూడొచ్చు. కేవలం ఆరడుగుల ప్రదేశంలో జోరుగా వాన కురుస్తుంది. అక్కడి నుంచి మరోవైపు చుక్క నీరు కూడా లేదు. ఈ వింత వర్షాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తామెప్పుడూ ఇలాంటి వర్షాన్ని చూడలేదని వారు చెబుతున్నారు.
ఇలా ఆరు అడుగులు మాత్రమే వర్షం పడుతున్న దృశ్యాన్ని కొందరు తమ తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మరోవైపు వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. కొన్నిరోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. అత్యవసరమైతే తప్ప బైటకు రావొద్దని కూడా సూచించింది. అంతేకాకుండా.. వర్షాకాంలో విద్యుత్ స్థంబాలు, కరెంట్ వయర్ల జోలికి పోవద్దని కూడా సూచించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.