Smita Sabharwal: ఎమోషనల్ అయిన స్మితా సబర్వాల్.. లేడీ ఐఏఎస్ పోస్టుకు సూపర్ హీరో అంటూ కామెంట్లు.. వైరల్ గా మారిన వీడియో..
IAS Officer Pamela Satpathy: ఐఏఎస్ అధికారిణి పమేలా సత్పతి తన ఛాంబర్ ఉండగా ఆమె కొడుకు సూపర్ మెన్ వేశం వేసుకుని రచ్చ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కూడా స్పందించారు.
IAS Officer Pamela Satpathy Son Plays On Her Office Desk: సాధారణంగా దేవుడు తల్లికి ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. తొమ్మిది నెలలపాటు ఎంతో కష్టపడి పిల్లలను కాపాడి, బిడ్డలకు జన్మనిస్తుంది. పుట్టిన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతుంటుంది. ఆ తల్లి.. ఇటు ఇంటి పనులు చేసుకుంటూ, అటూ ఉద్యోగం చేస్తుంటుంది. అదే విధంగా... పిల్లలకు కావాల్సిన వంటలు కూడా తనే చేస్తుంది. అదే విధంగా పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఒకేసారి మల్టీపుల్ టాస్క్ లను నిర్వహిస్తుంది. ఇదిలా ఉండగా.. చాలా మంది తల్లులు తమ పిల్లలను చూసుకొవడంలో ఇటు వర్క్ లైఫ్,అటూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంతో బ్యాలెన్సింగ్ చేస్తుంటారు. తాము అలిసిపోతున్న కూడా, ఎంత ఒత్తిడిలో ఉన్న కూడా పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చూసుకుంటారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఐఏఎస్ అధికారిణి పమేలా సత్పతి తనకుమారుడు ఆఫీస్ లో సూపర్ మెన్ వేసుకుని రచ్చ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. మహిళా అధికారిణి తన పనులను చేసుకుంటు, మరోవైపు బిడ్డను కూడా చూసుకుంటుంది. ముఖ్యంగా సమ్మర్ సీజన్ స్టార్ట్ కావడం వల్ల పిల్లలను తల్లులు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఎంత ఉన్నతోద్యోగం చేస్తున్న కూడా.. ఆ తల్లి తమ బిడ్డలను కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక్కడ పమేలా సత్పతి కూడా తన బిడ్డను ఆఫీస్ లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. తన పనులను ఆపకుండా, పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది.
ఈ వీడియోలో పిల్లాడు.. సూపర్ మెన్ కాస్ట్యూమ్ వేసుకుని,టెబుల్ పై అటు ఇటు వెళ్తు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో.. ఐఏఎస్ ఆఫీసర్ పమేలా సత్పతి ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గామారింది. ఇంట్లో పనిచేస్తుండగా.. టేబుల్ పై తన కొడుకు సూపర్ మ్యాన్ గెటప్ లో అల్లరి చేస్తున్న వీడియోను పమేలా పోస్ట్ చేశారు. దీనికి సదరు అధికారణి.. పిల్లలు ఏడాదంతా ఎదురుచూసే హాలీడేస్ వచ్చాయని.. పేరెంట్స్‌కు మాత్రం ఇవి భయంకరమైన రోజులని రాసుకొచ్చారు. చిన్న వయసు కొడుకు ఉన్న తల్లులకు మాత్రమే ఈ బాధలు బాగా తెలుస్తాయని అన్నారు. సమ్మర్ హాలీడేస్ లో పేరెంటింగ్ ఎంతో ఇబ్బందిగా ఉంటుందని హ్యాష్ ట్యాగ్స్ తో అర్థమయ్యేలా చెప్పారు పమేలా.
ఈ పోస్టుపై సీనియర్ ఐఏఎస్ అధికరిణి స్మితాసబర్వాల్ స్పందించారు. తను ఎమోషనల్ అయి.. ఈ పోస్ట్ ను రీట్వీట్ చేశారు. వర్కింగ్ మామ్స్ ఎప్పుడూ ఆఫ్ డ్యూటీలో ఉండరని నవ్వుతూ చెప్పారు. సోషల్ మీడియాలో ఎంతో క్యూట్ గా ఉన్న వీడియో చూశాననీ.. తను పిల్లలతో గడిపిన జ్ఞాపకాలు గుర్తొచ్చాయని అన్నారు స్మితా. ఇలాంటి పిడుగుల్లాంటి పిల్లలను హ్యాండిల్ చేయాలంటే మరింత ఎనర్జీ కావాలన్నారు. సూపర్ హీరో.. సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నాడని అన్నారు. స్మితా సభర్వాల్ చేసిన పోస్ట్ తనలో మరింత సంతోషం నింపిందని రిప్లై ఇచ్చారు పమేలా సత్పతి. ఈ కన్వర్జేషన్ చూసిన నెటిజన్లు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈవీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter