ఉదయం ఖాళీ కడుపుతో ఈ రసాన్ని తీసుకుంటే వారంలో కూర్చుని కూడా బరువు తగ్గొచ్చు!
Weight Loss Drink: ప్రతిరోజు ఉసిరి రసాన్ని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి. అంతేకాకుండా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను దృఢంగా చేసేందుకు కూడా సహాయపడతాయి.
Weight Loss Drink: ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఉసిరికాయలు 100 వ్యాధులకు పైగా నయం చేసే గుణాలను ఇది ఉంటాయి. అందుకే చాలామంది ఇప్పటికీ దీర్ఘకాలిక వ్యాధులకు దీనిని వినియోగిస్తూ ఉన్నారు. నిజానికి ఉసిరికాయలు లభించే విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కార్బోహైడ్రేట్లు, పీచు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులను సైతం సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. ప్రస్తుతం చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి రసాన్ని తాగుతూ ఉంటారు. నిజానికి ఇలా తాగడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. అయితే ఎలాంటి లాభాలు కలుగుతాయే మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజు ఉసిరి రసాన్ని తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉండడమే కాకుండా రక్తంలోని చక్కర పరిమాణాలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరంలోని టాక్సిన్స్‌ను సులభంగా తొలగించేందుకు కూడా సహాయపడతాయి. కాబట్టి ప్రతిరోజు ఈ రసాన్ని తాగడం వల్ల ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అంతేకాకుండా మార్నింగ్ డ్రింక్ గా ఈ రసాన్ని తీసుకోవడం వల్ల శరీర శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి. అలాగే దెబ్బతిన్న కణాలు కూడా మెరుగుపడతాయి.
అలాగే ఈ రసంలో విటమిన్ సి అధిక మోతాదులో లభిస్తుంది. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వ్యాయామం చేసిన తర్వాత ఈ రసాన్ని తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతే కాకుండా ఇందులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్ను తగ్గించేందు కూడా సహాయపడతాయి. అంతేకాకుండా తరచుగా గుండె సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు ఈ రసాన్ని తయారు చేసుకునే క్రమంలో ఈ క్రింది పద్ధతిని తప్పకుండా పాటించండి.
ఉసిరికాయ జ్యూస్ తయారీ విధానం:
కావలసిన పదార్థాలు:
7-5 జామకాయలు
2 టీస్పూన్లు నిమ్మరసం
కొద్దిగా అల్లం
10 పుదీనా ఆకులు
1 చిటికెడు నల్ల ఉప్పు
1 చిటికెడు జీలకర్ర
3 నల్ల మిరియాలు
కావలసినంత నీరు
తయారీ విధానం:
ముందుగా ఈ ఉసిరి రసాన్ని తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో పైన పేర్కొన్న పదార్థాలు అన్నింటిని వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అందులోనే తగినంత నీరు వేసుకొని మరో రెండు నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ జ్యూస్ ని బాగా ఫిల్టర్ చేసుకొని కావాలనుకుంటే అందులోనే రెండు ఐస్ క్రీమ్స్ వేసుకొని పైనుంచి పుదీనా ఆకులను గార్నిష్ చేసుకొని తాగొచ్చు.
ఉసిరి రసం తాగడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తి:
ఉసిరి రసంలో విటమిన్ సి అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా అధిక పరిమాణంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తి కూడా జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని వారు అంటున్నారు.
మలబద్ధకం:
తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ ఉసిరి రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా మలబద్ధకం సమస్య నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా పొట్ట ఉబ్బరం ఇతర సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉసిరిగసాన్ని తీసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి