Imran Khans lookalike Spotted Riding a Rickshaw: మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతుంటారు. కదా అప్పుడప్పుడు అలాంటి వాళ్లు కనిపిస్తే ఆశ్చర్యపోతుంటాం. తాజాగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పోలి ఉన్న ఓ యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సియోల్‌కోట్‌లో ఓ యువకుడు రిక్షాలో ప్రయాణిస్తుండగం కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan)‌ లాగ ఉన్న యువకుడు రిక్షాలో ప్రయాణిస్తున్నాడు చూడండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ మధ్య నీలి కళ్ల చాయ్‌వాలా సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతగా పాపులర్ అయ్యాడో తెలిసిందే.


Also Read: ATM Safety Tips: ఏటీఎం సేఫ్టీ టిప్స్ సూచించిన ఎస్‌బీఐ 


 


 



 


తాజాగా రిక్షాలో ప్రయాణించిన యువకుడు ఎవరు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. రిక్షా వెనుక భాగంలో కూర్చుని యువకుడు ప్రయాణించిన వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. పాకిస్తాన్(Pakistan) జాతీయ క్రికెట్ జట్టుకు వన్డే ప్రపంచ కప్ అందించిన కెప్టెన్‌గా ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ప్రజలకు ఎన్నటికీ గుర్తుండిపోతాడు. 2018లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి పాక్ ప్రధాని అయ్యారు ఇమ్రాన్ ఖాన్.


Also Read: Cheapest Recharge Plan: కేవలం రూ.2కే 1 GB డేటా, కాల్స్.. ప్లాన్ వివరాలు 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook