Wonder Women: చీరలో జిమ్నాస్టిక్ విన్యాసాలు.. నెటిజెన్లు ఫిదా
మహిళలు తలుచుకుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలరు. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది ఈ అమ్మాయి. ఈమె పేరు పారుల్ అరోరా ( Parul Arora ) .
మహిళలు తలుచుకుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలరు. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది ఈ అమ్మాయి. ఈమె పేరు పారుల్ అరోరా ( Parul Arora ) . జాతీయ స్థాయిలో జిమ్నాస్టిక్ లో గోల్డ్ మెడల్ సంపాదించింది. తనతో పాటు తన జిమ్నాస్టిక్ మిత్రులతో విన్యాసాలను వీడియో ( Viral Video ) తీసి వాటిని సోషల్ మీడియాలో ( Social Media ) అప్లోడ్ చేస్తుంది.
అయితే ఆమె ఇటీవలే అప్లోడ్ చేస్తున్న వీడియోలు నెటిజెన్స్ ను ( Netizens ) ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
స్పోర్ట్స్ డ్రెస్ లో , క్యాజువల్ డ్రెస్ లో జిమ్నాస్టిక్ స్టంట్స్ చేయడం అనేది మనందరికి తెలిసిన విషయమే. కానీ హరియాణాకు చెందిన పారుల్ అరోరా చీరలో, ట్రెడిషనల్ దుస్తుల్లో జిమ్నాస్టిక్ విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోలు బాగా షేర్ అవుతున్నాయి.