Facebook Pay On Instagram: ఫేస్‌బుక్ అనుబంధ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ ( Instagram ) తన యూజర్స్ కోసం సరికొత్త ఫీచర్ లాంచ్ చేసింది. షాపింగ్ పేజ్ ( Shopping Page ) అనే ఈ ఫీచర్‌తో ఆహ్లాదకరంగా షాపింగ్ ( Shopping on Instagram ) చేసుకోవచ్చు అని తెలుస్తోంది. దాంతో పాటుగా ఫేస్‌బుక్ పే (Facebook Pay ) ఆప్షన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులోకి తెచ్చింది. Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షాప్ పేజ్‌ను ఆప్ష‌న్‌ను వినియోగించుకోవాలి అనుకునే యూజ‌ర్లు ఎక్స్‌ప్లోర్ ( Explore Tab On Instagram ) అనే ట్యాబ్ కింది భాగంలో ఉండే షాప్ పేజ్‌ను ఎంచుకోవాలి. వెంట‌నే అనేక బ్రాండ్స్ ఆప్ష‌న్‌గా కనిపిస్తాయి. అయితే ఈ షాపింగ్ పేజీ అనే ఈ  ఫీచర్‌ను వినియోగించుకోవాలి అనుకునే యూజర్లు దాని కోసం ఇన్‌స్టాగ్రామ్‌కు ( Instagram Fee ) చెల్లించాల్సి ఉంటుంది అని "ది వెర్జ్" అనే వార్త పత్రిక తన రిపోర్ట్‌లో తెలిపింది. 


షాప్ పేజ్‌ను అనే ఆప్షన్ అనేది వినియోగదారులకు సరికొత్త అనుభవాన్ని ఇస్తుంది అని..ఇందులో షాపింగ్ ట్యాబ్స్ అందుబాటులో ఉంటాయి అని తెలిపింది. దీని వల్ల వినియోగదారులు మరింత వేగంగా, సౌకర్యవంతంగా షాపింగ్ (Shop Page Shopping Experience ) చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న వ్యాపారుల ( Selected Merchants ) కోసం మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది అని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాక్టివిటీ ట్యాబ్‌కు బదులుగా షాప్ పేజ్ ట్యాబ్ అందుబాటులో ఉంటుంది అని సమాచారం. ఫేస్‌బుక్ పే కూడా ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులో ఉంటుంది అని... అమెరికా పరిధిలో పేమెంట్స్, డొనేషన్స్ చేసుకోవచ్చు అని సమాచారం.  Also read:Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ