Jio, Airtel, Vi వినియోగదారులకు షాకింగ్ న్యూస్ ఇది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్ ధరలు పెరగనున్నాయి. అటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కూడా పెరిగిపోయింది. ఈ రెండింటికీ సంబంధమేంటి. పెరుగుతున్న కొత్త ప్లాన్ ధరలేంటి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో ప్రముఖ టెలికం కంపెనీలుగా ఉన్న జియో(Jio), ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ప్లాన్స్ ఇస్తుంటాయి. ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. తక్కువ ఖర్చులో యూజర్స్‌కు ఎక్కువ ప్రయోజనాలు కల్పిస్తుంటాయి. అయితే త్వరలోనే ఈ మూడు కంపెనీలు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరల్ని పెంచబోతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే జియో, ఎయిర్‌టెల్(Airtel), వోడాఫోన్ ఐడియాలు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్ ధరల్ని పెంచేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. ప్లాన్ ధరల్ని పెంచి..అదనంగా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్(Vodafone idea) ఐడియా ప్లాన్స్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్(OTT Platform)సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్నాయంటే..త్వరలో ప్లాన్స్ ధరలు పెరుగుతున్నాయనే అర్ధం. 


ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ (Amazon prime)త్వరలో అన్ని సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను పెంచాలని నిర్ణయించుకున్నట్టు అమెజాన్ ఇటీవల ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ ప్రస్తుతం మూడు రకాల ప్లాన్స్‌ను అమలు చేస్తోంది. ఇందులో 129 రూపాయల్నించి ఒక ప్లాన్ ప్రారంభం కానుంది. ఫోన్ కంపెనీల ప్లాన్స్‌తో ఓటీటీ ప్లాట్‌ఫామ్ అదనంగా అందించే కంపెనీలు ఇప్పుడు సబ్‌స్క్పిప్షన్‌ను కూడా పెంచనున్నాయి.అమెజాన్ ఒక నెల ప్లాన్‌ను 129 రూపాయల్నించి 179 రూపాయలకు పెరగనుంది. మూడు నెలల ప్లాన్ 329 రూపాయల్నించి 459 రూపాయలు కానుంది. ఇక 999 రూపాయల ఏడాది ప్లాన్‌ను 1499 రూపాయలు చేయనుంది. 


అమెజాన్ ఇప్పటికే ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ కొత్త ప్లాన్స్ ధరల్ని ప్రకటించింది. అయితే ఎప్పట్నించి ఈ కొత్త ప్లాన్ ధరలు అమల్లో వస్తాయనేది వెల్లడించలేదు. అమెజాన్ పెరిగినందున టెలీఫోన్ కంపెనీలు కూడా తమ ప్లాన్ ధరల్ని పెంచనున్నాయని తెలుస్తోంది.


Also read: Black Coffee Health Benefits: బ్లాక్ కాఫీతో బరువు ఎలా తగ్గించుకోవాలి, అద్భుత ప్రయోజనాలివే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook