పారిస్ వీధుల్లో హల్చల్ చేస్తున్న మిత్రవింద
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం విదేశాల్లో `పారిస్ పారిస్` షూటింగ్లో బిజీగా ఉన్నారు
కాజల్ అగర్వాల్.. ఈ టాలీవుడ్ బ్యూటీ "మగధీర" సిన్మా విడుదలయ్యాక, ఎక్కువగా మిత్రవిందగానే పాపులరైంది. ఇప్పుడు ఈమె హాయిగా పారిస్‌లో ఎంజాయ్ చేస్తోంది. అలాగే ఓ చిత్రంలో నటిస్తుంది కూడా. విచిత్రమేంటంటే ఆ చిత్రం పేరు "పారిస్ పారిస్". రమేష్ అరవింద్ దర్శకత్వంలో మెడింటే ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ నిర్మాణంలో తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథ మొత్తం హీరోయిన్ చుట్టూనే తిరగడం గమనార్హం. హిందీ చిత్రం "క్వీన్" ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కూడా ఇప్పుడు పారిస్‌లోనే సాగుతుంది. ఆ సందర్భంగా తన ఫేస్‌బుక్ పేజీలో పలు చిత్రాలు పోస్టు చేశారు కాజల్. షూటింగ్ స్పాట్ దగ్గర నుండీ తను పారిస్‌లో ఏ ఏ ప్రాంతాలు తిరిగిందో.. ఆ విశేషాలన్ని కెమెరాలో బంధించి తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆమె. కాజల్ ప్రస్తుతం తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన "ఎమ్మెల్యే" చిత్రంలో నటిస్తున్నారు.