kalki 2898 movie set ganesh in krishnagiri tamilnadu  video: కొంత మంది ట్రెండ్ కు తగ్గట్టుగా ఏదో ఒకటి వెరైటీగా చేయాలనుకుంటారు. ఇటీవల కల్కీ 2898 మూవీ ఎంత ఫెమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీపికా పదుకొనె, అశ్వత్థామ, కమల్ హాసన్, భైరవ పాత్రలో ప్రభాస్ అదరగొట్టారు. ఇక మూవీకి హైలేట్ గా బుజ్జీ వెహికిల్ నిలిచిందని చెప్పడంతో ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. బుజ్జీకి వాయిస్ ఇచ్చి.. కీర్తి సురేష్ మరింత హైప్ క్రియేట్ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ మూవీలో సుప్రీమ్ యాస్కీ మరో ప్రదేశంలో ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అక్కడ కేవలం కొంత మంది మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో భైరవ మాత్రం..  కాంప్లెక్స్ లోకి వెళ్లేందుకు తెగకష్టపడిపోతుంటాడు.ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హీట్ కొట్టింది. విడుదలైన అన్ని భాషల్లో కూడా.. దుమ్మురేపే వసూళ్లను రాబట్టి అనేక రికార్డులను మరల తిరగ రాసింది. ఇదిలా ఉండగా.. దేశంలో వినాయక చవితి సంబరాలు నడుస్తున్నాయి.


ఎక్కడ చూసిన మండపాలను ఏర్పాటు చేసినగణపయ్యలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కొంత మంది వెరైటీ వినాయకుల విగ్రహాలను సైతం ఏర్పాటు చేస్తుంటారు. గతంలో బాహుబలి గణపతి, పుష్ప వినాయకుడు, తాజాగా, పుష్ఫ 2 సూసేందుకు.. పాటలోని అల్లుఅర్జున్,నేషనల్ క్రష్ ల మాదిరిగా కూడా గణపయ్యలను ఏర్పాటు చేశారు. తాజాగా, కల్కీ మూవీలో అశ్వత్థామగా వినాయకుడు ఉన్న సెట్ ను తమిళనాడులో ఏర్పాటు చేశారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు...


తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో కల్కి సినిమా సెట్‌లా వినాయకుని మందిరం సెట్ స్పెషల్ గా నిలిచింది. ప్రస్తుతం కల్కీ ట్రెండ్ నడుస్తోంది. కాబట్టి ఈ సెట్ ను ఏర్పాటు చేసినట్లు కూడా నిర్వాహాకులు చెప్తున్నారు. అదే విధంగా.. కాంప్లెక్స్‌లో నుంచి లోపలికి వెళ్లేలా కూడా దీనిని డిజైన్‌ చేశారు. లోపల కమల్‌ హాసన్‌ పాత్ర బొమ్మ పెట్టి.. శివలింగంతో పాటు పక్కనే అశ్వత్థామగా వినాయకుడిని ఏర్పాటు చేశారు.


Read more: Viral video: బాప్ రే.. నరాలు తేగె ఉత్కంఠ.. చూస్తుండగానే మునిగిపోయిన కారు.. టాప్ మీద జంట.. వీడియో వైరల్..


ఇక్కడ బుజ్జీ కారును సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కల్కి గణేష్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ గణపయ్యను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున వస్తున్నారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.