Fact check on KBC Lottery Scam : కేబీసీ లాటరీలో రూ.25 లక్షలు గెలుచుకున్నట్టు మెస్సేజ్ వచ్చిందా? నమ్మొచ్చా?
Fact check on KBC Lottery Scam : కేబీసీ లాటరీ పేరుతో టెలివిజన్‌లో ప్రసారమయ్యే కార్యక్రమం తెలియనివాళ్లు ఉండరు. ఆ ప్రోగ్రాం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే ఈ కార్యక్రమానికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఉంది. అయితే, ఇప్పుడు ఇదే పేరుతో లాటరీ మెస్సేజ్ వాట్సప్‌లలో చక్కర్లు కొట్టడంపై జీ తెలుగు న్యూస్ ఫ్యాక్ట్‌చెక్ చేసింది.
Fact check on KBC Lottery SCam : వాట్సప్‌లో కొత్తగా కేబీసీ లాటరీ పేరుతో ఓ మెస్సేజ్ వైరల్ అవుతోంది. ఉత్తరాదికి చెందిన గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సప్‌కు ఈ మెస్సేజ్ పంపిస్తున్నారు. ఈ మెస్సేజ్‌లో ఓ స్క్రీన్‌షాట్‌తో పాటు.. బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ రికార్డ్ అయి ఉంటోంది.
[[{"fid":"236107","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"kbc-lottery-scam-messages.jpg","field_file_image_title_text[und][0][value]":"kbc-lottery-scam-messages.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"kbc-lottery-scam-messages.jpg","field_file_image_title_text[und][0][value]":"kbc-lottery-scam-messages.jpg"}},"link_text":false,"attributes":{"alt":"kbc-lottery-scam-messages.jpg","title":"kbc-lottery-scam-messages.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
వైరల్ అవుతున్నది ఏంటి?
కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమం నుంచి ఈ మెస్సేజ్ పంపిస్తున్నట్లు ఆ స్క్రీన్‌షాట్‌లో ఉన్న కార్డ్ డిజైన్ చేస్తున్నారు. అందులో అమితాబ్ బచ్చన్ ఫోటో కూడా వినియోగిస్తున్నారు. మీరు రూ.25లక్షల లాటరీ గెలుచుకున్నారని ఆ మెస్సేజ్‌లో ఉంటోంది. ఈ మెస్సేజ్ రిసీవ్ చేసుకున్నవాళ్లు సంప్రదించాల్సిన నెంబర్, రాణాప్రతాప్ సింగ్ అంటూ సంబంధిత వ్యక్తి పేరు కూడా అందులో పేర్కొంటున్నారు. ఆ కార్డ్‌లో లాటరీ నెంబర్ ప్రింట్ అయి ఉంటోంది. ఆ లాటరీ నెంబర్‌ను కార్డ్‌లో సూచించిన నెంబర్‌కు వాట్సప్‌కు పంపిస్తే.. తదుపరి తాము అందుబాటులోకి వస్తామని చెబుతున్నారు. ఆ కార్డ్‌కు తోడు ఆడియోను కూడా జత చేస్తున్నారు.
వాస్తవం ఏంటి ?
కేబీసీ లాటరీ పేరుతో టెలివిజన్‌లో ప్రసారమయ్యే కార్యక్రమం తెలియనివాళ్లు ఉండరు. ఆ ప్రోగ్రాం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే ఈ కార్యక్రమానికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఉంది. అయితే, ఇప్పుడు ఇదే పేరుతో లాటరీ మెస్సేజ్ వాట్సప్‌లలో చక్కర్లు కొట్టడంపై జీ తెలుగు న్యూస్ ఫ్యాక్ట్‌చెక్ చేసింది. గూగుల్‌లో ఈ స్క్రీన్‌షాట్‌తో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్ ఒక్కటే కాదు.. దానిని పోలిన మరిన్ని స్క్రీన్ షాట్‌లు ఇంటర్‌నెట్‌లో కనిపించాయి. లాటరీ కోసం వాళ్లను కాంటాక్ట్ చేయాల్సిన సెల్‌నెంబర్లు కూడా ఒక్కో స్క్రీన్‌షాట్‌కూ మారిపోయాయి. అంతేకాదు.. అది ఒక స్కామ్ అని కొన్ని రిపోర్ట్‌లు కనిపించాయి. రాజస్తాన్ పోలీసులు ఈ స్కామ్‌ను నమ్మొద్దని ట్విట్టర్‌లో హెచ్చరించడం కనిపించింది.
ఢిల్లీ పోలీసులు కూడా తమ బ్లాగ్‌లో కేబీసీ లాటరీ స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
http://cybercelldelhi.in/KBClottery.html
ఈ మెస్సేజ్ వస్తే ఏం చేయాలి?
కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఒకటైన వాట్సప్ వాడకం అత్యధికంగా ఉండటంతో వాట్సప్‌ను సైబర్ నేరగాళ్లు వాహకంగా వాడుకుంటున్నారు. ఇలాగే 25 లక్షలు లాటరీ గెలుచుకున్నట్లు వాట్సాప్ నంబర్‌కు ఏదైనా మెసేజ్ వస్తే దానిని పట్టించుకోవద్దని సైబర్ నిపుణులు సలహా ఇస్తున్నారు. లేకుంటే వాళ్ల చేతుల్లో మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు దక్షిణాదికి పాకిన ఈ కేబీసీ లాటరీ మెస్సేజ్ స్కామ్ ఇప్పటికే ఉత్తరాదికి చెందిన ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల వినియోగదారులకు ఇప్పటికే పంపించారని అక్కడ చాలా మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారని ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులు ఓ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
కేబీసీ స్కామ్ జరిగే తీరు ఇది :
కేబీసీ అనగానే కోటి రూపాయలను పార్టిసిపేంట్‌కు ఇచ్చే కార్యక్రమమని అందరికీ తెలుసు. అలాంటి కార్యక్రమానికి సంబంధించిన వాళ్లు ఈ లాటరీలో తమ మొబైల్ నెంబర్‌ను సెలెక్ట్ చేయడం, 25లక్షల రూపాయలు ఇస్తామనడంతో.. పలువురు వీళ్ల ఉచ్చులో పడిపోతున్నారు. వాళ్లు చెప్పినట్లు చేస్తున్నారు. ఢిల్లీ సైబర్ క్రైమ్ సెల్ బ్లాగ్‌లో ఈ స్కామ్ సాగే తీరును వివరించారు. లాటరీ నెంబర్‌ను వాట్సప్ చేయగానే.. లాటరీ సొమ్మును క్లెయిమ్ చేసుకోవాలంటే.. జీఎస్‌టీ, ప్రాసెసింగ్‌ఫీజు, ఇతర చార్జీలంటూ కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలని అడుగుతారు. బాధితుడు ఆ మొత్తం వాళ్లకు ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత.. లాటరీలో గెలుచుకున్న డబ్బులు రూ.45 లక్షలు, రూ.75 లక్షలకు పెంచామని అంతమొత్తం పెరిగిన డబ్బులకు అనుగుణంగా మరిన్ని చార్జీలు, జీఎస్‌టీ పేరిట చెల్లించాలని మరికొంత డిమాండ్ చేస్తారు. అలా.. లక్షల్లో అమాయకుల నుంచి వసూలు చేస్తారు. వీళ్లేమో రూ.75 లక్షలు వస్తాయన్న ఊహల్లో మునిగిపోతారు. అలా.. బాధితుడు వీళ్లు చెప్పింది విన్నంతకాలం ఆ చార్జీలు, ఈ చార్జీలు అంటూ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటూనే ఉంటారని ఢిల్లీ సైబర్ విభాగం నిపుణులు వివరిస్తున్నారు. తాము మోసపోయామని గ్రహించేసరికి కమ్యూనికేషన్ కట్ చేస్తారు.
ఢిల్లీలో ఇద్దరు అరెస్ట్ :
కేబీసీ స్కామ్ పేరుతో ఢిల్లీలో దాదాపు వందమందిని మోసగించిన కేసులో ప్రణవ్‌కుమార్ మిశ్రా, గౌతమ్ ప్రసాద్ యాదవ్ అనే ఇద్దరిని అక్కడి పోలీసులు ఈనెల 1వ తేదీన అరెస్ట్ చేశారు.
ప్రచారం : కేబీసీ లాటరీలో రూ.25 లక్షలు గెలుచుకున్నారు.
వాస్తవం : ఇది కేబీసీ లాటరీ స్కామ్. సైబర్ నేరగాళ్లు వాట్సప్‌లో ఎరవేస్తూ.. అమాయకులను మోసం చేస్తున్నారు.
Also read : Ammavodi Scheme: అమ్మ ఒడి పథకంలో మరో కోత..ల్యాప్‌టాప్ ఇచ్చే విధానంపై యూటర్న్
Also read : Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్..రేపే అన్నదాతల ఖాతాల్లోకి సాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.