Kig Cobra Egg: 25 ఏళ్ల కింగ్ కోబ్రా.. ఎన్ని గుడ్లు పెట్టిందో తెలుసా? బుసలు కొడుతున్నా ఎగ్స్ బయటికి తీసుకొచ్చాడు
King Cobra Viral Video, Snake catcher Find King Cobras Eggs. స్నేక్ క్యాచర్ మురళీవాలే హౌస్లా తాజాగా మరో పెద్ద కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. అది 25 ఏళ్ల కింగ్ కోబ్రా అట.
Snake catcher Find 25 years old King Cobras Eggs at orchard: సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా జంతువులకు సంబందించిన వీడియోస్ వైరల్ అవుతాయి. సింహం, చిరుత, మొసలి, ఏనుగు, కోతి, కుక్క, పిల్లి, పాములకు సంబందించినవి ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం భయభ్రాంతులకు గురిచేస్థాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెద్ద కింగ్ కోబ్రాను ఓ స్నేక్ క్యాచర్ పట్టుకున్నాడు.
స్నేక్ క్యాచర్ మురళీవాలే హౌస్లా తాజాగా మరో పెద్ద కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. అది 25 ఏళ్ల కింగ్ కోబ్రా అని మురళీవాలే చెప్పాడు. వీడియో ప్రకారం... పంట పొలాల్లో ఇటుకలు ఉన్నాయి. ఇటుకలు తీస్తుండగా కూలీలకు కింగ్ కోబ్రా గుడ్లు కనిపించాయి. ఇక్కడ పాము ఉందని భావించిన కూలీలు వెంటనే స్నేక్ క్యాచర్ మురళీవాలేకు కాల్ చేశారు. అక్కడికి వెళ్లిన మురళీవాలే ముందుగా గుడ్లు బయటికి తీశాడు. దాదాపుగా 7-8 గుడ్లు ఉన్నాయి. ఈ గుడ్లు పెట్టింది 25 ఏళ్ల కింగ్ కోబ్రా అని, భారత దేశంలో ఇలాంటి పాములు ఎక్కువగా ఉంటాయని చెప్పాడు.
గుడ్లు తీసిన అనంతరం కింగ్ కోబ్రా కోసం వెతకగా.. అది ఇటుకల మధ్య ఉంది. మురళీవాలే హౌస్లా ఒక్కో ఇటుక తీస్తుండగా.. అది బయటకు వచ్చింది. ఈ సమయంలో పాము బుసలు కొడుతూ కురవడానికి దూసుకొచ్చింది. అయినా కూడా మురళీవాలే.. స్టిక్ సాయంతో దాన్ని బయటకు తీశాడు. ఆపై ఓ ప్లాస్టిక్ డబ్బాలో వేసి అడవిలో వదిలేశాడు. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోకి 29,790,299 వ్యూస్ వచ్చాయి.
Also Read: Shahid Afridi-Kohli: విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై షాహిద్ అఫ్రిదీ కీలక వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook