Rape Attempt On Minor Girl: మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం.. కాలు విరగ్గొట్టి, బాలికకు నరకం చూపించిన వైనం..

Jharkhand 14 Year Old girl Brutally Thrashed: జార్ఖండ్‌లో ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నం తీవ్ర కలకలం రేపుతోంది. బాలికపై అత్యాచారయత్నం చేసిన ఆటో డ్రైవర్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 23, 2022, 12:01 PM IST
  • జార్ఖండ్‌లో మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం
  • ప్రతిఘటించడంతో బాలికపై దాడి
  • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాలిక
Rape Attempt On Minor Girl: మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం.. కాలు విరగ్గొట్టి, బాలికకు నరకం చూపించిన వైనం..

Rape Attempt On Minor Girl: జార్ఖండ్‌లోని దుంకా జిల్లాలో దారుణం వెలుగుచూసింది. 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన ఓ ఆటో డ్రైవర్.. ఆ బాలిక ప్రతిఘటించడంతో ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. కాలు విరగ్గొట్టి నిర్మానుష్య ప్రదేశంలో పడేసి వెళ్లిపోయాడు. అపస్మారక స్థితిలో రాత్రంతా అక్కడే గడిపిన బాలిక.. మరుసటి రోజు ఉదయం ఎలాగోలా పోలీస్ స్టేషన్‌కు చేరుకోగలిగింది. బాధిత బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గత శనివారం (ఆగస్టు 20) బాలిక దుంకా జిల్లాలోని తమ గ్రామం నుంచి రామ్‌గఢ్‌లో ఉండే తన మామయ్య ఇంటికి బయలుదేరింది. మధ్యాహ్నం 3.40 గం. సమయంలో బసుకినాథ్ బస్టాండ్‌లో దిగింది. కాసేపటికి ఓ ఆటో ఆమె వద్దకు వచ్చి ఆగింది. రామ్‌గఢ్‌కి వెళ్తున్నట్లు చెప్పడంతో బాలిక అందులో ఎక్కింది. అప్పటికే ఆటోలో మరో బాలిక కూడా ఉంది.

ఆటో సగం దూరం వెళ్లాక డ్రైవర్ ఆ బాలికలను ఓ నిర్మానుష్య ప్రదేశం వైపు తీసుకెళ్లాడు. ఇద్దరితో అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో బాలికలిద్దరు భయపడిపోయారు. ఇద్దరిలో ఓ బాలిక అతని బారి నుంచి తప్పించుకోగలిగింది. మరో బాలిక అతని చేతికి చిక్కగా అత్యాచారానికి యత్నించాడు. బాలిక గట్టిగా ప్రతిఘటించడంతో కర్రతో ఆమెపై దాడి చేసి కాలు విరగ్గొట్టాడు. అనంతరం ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఆమెను పడేసి వెళ్లిపోయాడు.

తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలిక రాత్రంతా అక్కడే గడిపింది. మరుసటిరోజు ఉదయం సత్తువ కూడదీసుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధిత బాలిక ఫిర్యాదుతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 

Also Read:Kakinada: చనిపోయిన 59 రోజులకు అసలు విషయం బయటపడింది.. చంపింది భార్యే.. పక్కా స్కెచ్..

Also Read: Munugode Bypoll: 5 వందలు.. మందు.. మటన్ బిర్యానీ! జనాలకు ఉపాధినిస్తున్న మునుగోడు ఉపఎన్నిక 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News