Shahid Afridi-Kohli: విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై షాహిద్‌ అఫ్రిదీ కీలక వ్యాఖ్యలు!

Asia Cup 2022, Shahid Afridi about Virat Kohli's future. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ భవిష్యత్తుపై పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్‌ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 22, 2022, 01:50 PM IST
  • ఫామ్ లేమితో సతమతమవుతున్న కోహ్లీ
  • ఆసియా కప్ 2022 ద్వారా తిరిగి మైదానంలోకి
  • కష్ట కాలంలోనే సత్తా బయటపడుతుంది
Shahid Afridi-Kohli: విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై షాహిద్‌ అఫ్రిదీ కీలక వ్యాఖ్యలు!

Shahid Afridi on Virat Kohlis future ahead of Asia Cup 2022: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ భవిష్యత్తుపై పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్‌ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ భవిష్యత్తు అతడి చేతుల్లోనే ఉందన్నాడు. ఆదివారం రాత్రి అఫ్రిది ట్విటర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని కోహ్లీ భవిష్యత్తు ఏంటని అడగ్గా.. అది అతడి చేతుల్లోనే ఉందిని బదులిచ్చాడు. దాదాపు ఐదు వారాల విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. ఆసియా కప్ 2022 ద్వారా తిరిగి మైదానంలోకి దిగుతున్నాడు. ఆగష్టు 28న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచులో ఆడనున్నాడు.

విరాట్ కోహ్లీ గత మూడు ఏళ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఒక్కప్పుడు మంచినీళ్ల ప్రాయంగా హాఫ్ సెంచరీ, సెంచరీలు చేసే కోహ్లీ బ్యాట్ మూగబోయింది. మూడు ఫార్మాట్లలో ఆడపాదడపా ఇన్నింగ్స్‌లు తప్ప ఒక్క శతకం బాధలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సెంచరీ లేకుండా ఇటీవల వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నాడు. ఇదే విషయాన్ని ఓ అభిమాని షాహిద్‌ అఫ్రిది వద్ద ప్రస్తావించాడు. దీనికి అఫ్రిది స్పందిస్తూ.. 'పెద్ద ఆటగాళ్ల సత్తా కష్ట కాలంలోనే బయటపడుతుంది' అని అన్నాడు.

ఆసియా కప్ 2022 ఆగష్టు 27న ఆరంభం కానుంది. 28న పాకిస్థాన్‌, భారత్ జట్లు తలపడనున్నాయి. టీ20 ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై విరాట్‌ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. పొట్టి ఫార్మాట్‌లో 77.75 సగటుతో 311 పరుగులు చేశాడు. ఇందులో కోహ్లీ 35 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో విరాట్ 99 మ్యాచుల్లో 3308 రన్స్ చేశాడు. ఇందులో 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 94. 

Also Read: స్నేహితుల మధ్య బైక్ స్టంట్ వేశాడు.. మూల్యం చెల్లించుకున్నాడు! వీడియో చూస్తే గూస్‌బంప్స్ పక్కా

Also Read: Karthikeya2 Collections: ఆదివారం రచ్చ రేపిన వసూళ్లు.. టోటల్ ఎన్ని కోట్లంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News