12 feet King Cobra in Old House: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి సింహం, చిరుత, ఏనుగు, మొసలి, కోతి, కుక్క, పిల్లి, పాములకు సంబందించిన వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు చాలా సరదాగా ఉంటే.. మరికొన్ని సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం చాలా భయబ్రాంతులకు గురిచేస్తాయి. అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాత ఇంట్లో నక్కిన 12 అడుగుల కింగ్ కోబ్రాను ఓ వ్యక్తి చాలా సులువుగా పట్టేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీర్జా ఎండీ ఆరిఫ్ అనే వ్యక్తి స్నేక్ క్యాచర్‌గా ఒడిశాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంత డేంజరస్ పామును అయినా చాలా ఈజీగా పట్టుకుంటాడు. అది కింగ్ కోబ్రా అయినా సరే అస్సలు వెనకాడడు. ఒట్టిచేతులతోనే చాలా సులువుగా పట్టుకుంటాడు. ఒడిశా రాష్ట్రం బాలాసోర్ పరిసర ప్రాంతంలోని ఓ గ్రామంలో 12 అడుగుల కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియోను స్నేక్ క్యాచర్‌ ఆరిఫ్ తన సొంత యూట్యూబ్‌ ఛానెల్ (MIRZA MD ARIF)లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. 



బాలాసోర్ పరిసర ప్రాంత గ్రామంలోని ఓ పాత ఇంట్లో 12 అడుగుల డేంజరస్ కింగ్ కోబ్రా ఉంది. ఇంటి యజమాని ఇది గమనించి స్నేక్ క్యాచర్‌ మీర్జా ఎండీ ఆరిఫ్ కు కబురు పంపారు. రాత్రి అయినా సరే పామును పట్టడానికి అతడు వచ్చాడు. ఇంట్లో చాలా సమయం వెతికిన తర్వాత అది కనబడింది. పారిపోతున్న దాన్ని పట్టుకోవడానికి ఆరిఫ్ ప్రయత్నించినా అది చిక్కలేదు. బయటికి వచ్చి ఓ తాటి కమ్మలో దాక్కుంది. తాటి కమ్మను కిందపడేయగా కింగ్ కోబ్రా బుసలు కొడుతూ పడగ విప్పింది. అయినా కూడా స్నేక్ క్యాచర్‌ ఆరిఫ్ వెనకడుగు వేయకుండా దాన్ని పట్టుకున్నాడు. కింగ్ కోబ్రా 2-3 సార్లు కాటేయడానికి వచ్చినా.. దానికి ఆ అవకాశం ఇవ్వలేదు. చివరకు దాన్ని సంచిలో వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 


Also Read: Ketika Sharma Images: కేతిక శర్మ స్టన్నింగ్ స్టిల్స్.. చుడీదార్‌లో అచ్చమైన తెలుగమ్మాయిలా మెరిసిపోతుందిగా!


Also Read: Bank Holidays September 2022: 5 రోజులు బ్యాంకులకు హాలిడేస్.. పక్కాగా ప్లాన్ చేసుకోండి!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook