Bank Holidays September 2022 List: సెప్టెంబర్ నెలలో ఇప్పటికే సగం రోజులు గడిచాయి. ఈ నెలలో ఇంకా 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని మిగిలి ఉంటే.. త్వరగా పూర్తి చేసుకోండి. ఎందుకంటే సెప్టెంబర్ మాసంలో మిగిలిన 15 రోజుల్లో ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అంటే 15 రోజుల్లో 9 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. సెప్టెంబర్ నెలలో మొత్తం 13 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అందులో 8 సెలవులు పూర్తయ్యాయి.
సెప్టెంబర్ నెలలో రానున్న రోజుల్లో ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బ్యాంకుకు వెళ్లాల్సి వస్తే.. సెలవు గురించి తెలుసుకున్న తర్వాతే వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతి సంవత్సరం (బ్యాంకు హాలిడేస్) సెలవుల జాబితా క్యాలెండర్‌ను జారీ చేస్తుంది. ఇందులో కొన్ని జాతీయ స్థాయిలో సెలవులు, కొన్ని స్థానిక సెలవులు ఉంటాయి. స్థానిక సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సెలవు రోజుల్లో బ్యాంకులు పనిచేయవు.
సెప్టెంబర్ 15 తర్వాత బ్యాంకు సెలవుల జాబితా ఇదే:
18 సెప్టెంబర్ - ఆదివారం
21 సెప్టెంబర్ - శ్రీ నారాయణ గురు సమాధి దివస్
24 సెప్టెంబర్ - నాలుగో శనివారం
25 సెప్టెంబర్ - ఆదివారం
26 సెప్టెంబర్ - నవరాత్రి స్థాపన
ప్రతీ నెలలో ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులు మూసి ఉంటాయన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లోని మిగిలిన రోజల్లో తెలంగాణ రాష్ట్రంలో నవరాత్రి స్థాపన (బతుకమ్మ మొదటి రోజు) తప్ప మిగతా పండుగలు, పర్వదినాలు ఏవీ లేకపోవడంతో ఇతర హాలిడేస్ లేవు. ఇక సెప్టెంబర్ 26న నవరాత్రుల స్థాపన కారణంగా మణిపూర్‌లోని జైపూర్, ఇంఫాల్‌లలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
Also Read: Rajnath Singh - Prabhas: హీరో ప్రభాస్ ఇంటికి కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్!
Also Read: రాహుల్‌తో కలిసి పంత్‌ను ఓపెనర్‌గా పంపు.. రోహిత్‌కు మాజీ బ్యాటర్ సూచన! బ్యాటింగ్ ఆర్డర్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook