Snake Catcher Rescue 16 feet King Cobra: ఒకప్పుడు ఇంట్లోకి పాములు దూరితే పొగ పెట్టి ఇంటి నుంచి వాటిని తరిమికొట్టేవారు. పొగ కారణంగా పాములకు శ్వాస ఆడక ఇంట్లో నుంచి పారిపోతాయి. పథ రోజుల్లో పాములను చంపేందుకు కొన్ని ప్రత్యేక పనిముట్లను కూడా వాడేవారు. అయితే ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది. ఇంట్లో, తోటల్లో పాములు దూరితే.. వాటిని పట్టేందుకు స్నేక్‌ క్యాచర్‌లను పిలుస్తున్నారు. స్నేక్‌ క్యాచర్‌లు పాములను చాలా సులువుగా పెట్టేసి బందిస్తుంటారు. అయితే కొన్ని పాములు స్నేక్‌ క్యాచర్‌లకు కూడా చిక్కవు. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒడిశాలోని బాలాసోర్ జిల్లా పరిసర ప్రాంత గ్రామం కామర్పాడలోని ఓ పాత ఇంట్లో 16 అడుగుల కింగ్ కోబ్రా దూరింది. ఇంటి యజమాని భార్య పాముని చూసి ఒక్కసారిగా హడలిపోయింది. విషయం భర్తకు చెప్పి వణిపోయింది. యజమాని వెంటనే స్నేక్ క్యాచర్‌ మీర్జా ఎండీ ఆరిఫ్‌కు కబురు పంపాడు. రాత్రి అయినా సరే పామును పట్టడానికి  కామర్పాడ గ్రామానికి ఆరిఫ్‌ వచ్చాడు. అప్పటికే పామును చూడ్డానికి జనాలు భారీగా గుమికూడారు. అందరిని దాటుకుని స్నేక్ క్యాచర్‌ ఆరిఫ్‌ ఇంటిలోపలికి వెళ్లాడు.


పాత ఇంట్లోని ఓ రూంలో చాలా సమయం వెతికిన తర్వాత బెడ్ కింద కింగ్ కోబ్రా కనబడింది. స్టిక్ సాయంతో బెడ్ కింద వెతకగా.. కింగ్ కోబ్రా పారిపోయింది. పారిపోతున్న దాన్ని పట్టుకోవడానికి ఆరిఫ్ ప్రయత్నించినా పాము చిక్కలేదు. ఇంటి బయటికి వచ్చి తాటి కమ్మలలో దాక్కుంది. ఓ తాటి కమ్మను కిందపడేయగా.. కింగ్ కోబ్రా బుసలు కొడుతూ పడగ విప్పింది. అయినా కూడా స్నేక్ క్యాచర్‌ ఆరిఫ్ వెనకడుగు వేయకుండా పాము తోకను పట్టుకున్నాడు. కింగ్ కోబ్రా కాటేయడానికి వచ్చినా దానికి ఆ అవకాశం ఇవ్వలేదు. పామును తోక పట్టుకుని బయటికి తీసుకొచ్చి సంచిలో బంధించాడు. దీంతో ఆ పాము సంచిలోకి వెళ్లింపోయింది.



స్నేక్ క్యాచర్‌ మీర్జా ఎండీ ఆరిఫ్‌ పట్టిన భారీ కింగ్ కోబ్రాకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి ఈ వీడియో 4 సంవత్సరాల క్రితం నాటిదే అయినా.. ఇప్పుడు మరోసారి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 22,391,534 వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఆరిఫ్‌ దైర్యం చూసి అందరూ షాక్ అవుతున్నారు.  


Also Read: IND vs AUS 2nd Test: ముగిసిన తొలిరోజు ఆట.. ఆసీస్ 263 పరుగులకు ఆలౌట్! భారత్ స్కోర్ ఏంటంటే  


Also Read: Parasuram Skips Devarakonda: ఆగిన పరశురామ్-దేవరకొండ ప్రాజెక్ట్..ఎందుకొచ్చిన గొడవరా బాబూ?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి