King Cobra Video, King Cobra try to bite man: పాముల అన్నింటిలో అత్యంత ప్రమాదకరమైన పాము 'కింగ్ కోబ్రా'. ఇది విషపూరితమైనదే కాకుండా.. చాలా పొడవుగా కూడా ఉంటుంది. ఇలాంటి పాము మనుషులను కాటేస్తే.. నిమిషాల వ్యవధిలో ప్రాణాలు పోతాయి. అలాంటి ప్రమాదకరమైన పాములను కూడా కొందరు సులువుగా పట్టుకుంటారు. అంతేకాదు వాటితో ఆటలు కూడా ఆడతారు. అయితే ఒక్కోసారి అవి కాటు వేయడానికి ప్రయత్నిస్థాయి. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైరల్ అవుతున్న వీడియోలో ఓ స్నేక్ ట్రైనర్ అడవి లాంటి ప్రాంతంలో పొడవైన మరియు ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను పట్టుకుంటాడు. ఆపై దానిని తన రెండు చేతులతో పైకి ఎత్తి ఆడుకుంటుంటాడు. మొదట పాము చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంత సమయం తర్వాత అది ఆ వ్యక్తిని మొహంపై కాటు వేసేందుకు ప్రయత్నిస్తుంది. కాటు వేయడానికి ముందుకు వస్తుండగా.. పాము నుంచి తప్పించుకోవడానికి ఆ వ్యక్తి తన తలను వేగంగా పక్కకు తిప్పుతాడు. కొన్ని సెకండ్లు ఆలస్యం అయితే అది ఖచ్చితంగా ఆ వ్యక్తిని కాటేసేదే. తృటిలో పెను ప్రమాదం తప్పింది. 


వన్య ప్రాణులకు సంబంధించిన ఈ వీడియో 'జంతువులు_పవర్స్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోకి ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి. ఈ వీడియో చూసి సోషల్ మీడియా యూజర్లు షాక్ అవుతున్నారు. అదే సమయంలో కామెంట్ల వర్షం కురుస్తోంది. 'కింగ్ కోబ్రాతో చెలగాటం అవసరమా' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'ఆటలు ఆడితే అట్లనే ఉంటది' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ఈ వీడియో చాలా భయానకరంగా ఉందని ట్వీట్ చేస్తున్నారు. 


Also Read: Rupee Drops: రూపాయి ఢమాల్.. చరిత్రలో తొలిసారిగా 80కి పతనమైన దేశీ కరెన్సీ...  


Also Read: Konaseema Floods: లంక గ్రామాల్లో వరద బీభత్సం.. ఆహార పొట్లాల కోసం కొట్టుకుంటున్న ప్రజలు!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook