Live Accident: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తరచూ ప్రమాదలు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలకు సంబంధించి వార్తలు వింటూనే ఉన్నాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే వాహనదారులు చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా కొన్ని సార్లు పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఇప్పుడు రోడ్లపై సీసీ కెమెరాలు అమర్చడం వల్ల ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకోవడం కూడా సులభతరమైంది.


ఉత్తర్​ ప్రదేశ్​లోని అలీగఢ్​లో ఇటీవల జరిగిన ఓ కారు ప్రమాదం వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. చిన్న పొరపాటు ఎంత పెద్ద ప్రమాదానికి కారణమైందో ఆ ఆ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.


వీడియోలో ఏముందంటే..


రోడ్డుపై వాహనాలు సాధారణ వేగంతో వెళ్తుండగా.. వెనక నుంచి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. అయితే వేగం అదుపుకావడం వల్ల డివైడర్​ను ఢీ కొట్టి రెండు పల్టీలు పడింది. పల్టీ పడిన సమయంలో కారు ముదు ఓ బైకర్​ ఉన్నాడు. ఆ బైకర్​ భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పుకున్నాడు.


అయితే కారులో ఉన్న వ్యక్తి మాత్రం గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ఆ కారులో ఉన్న వ్యక్తిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి ప్రాణపాయం లేదని వెల్లడించడం గమనార్హం.


ఈ ఘటన అలీగఢ్​ ముస్లీం యూనివర్సిటీ వద్ద చోటు చేసుకుంది. సోమవారం ఘటన జరిగింది. ఇందుకు సంబంధంచిన సీసీ టీవీ దృష్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి. ఆ వీడియోను మీరు చూసేయండి.



Also read: Earn Money Online: కెమెరా ఆన్ చేసి నిద్రపోయాడు.. కట్ చేస్తే లక్షాధికారి అయ్యాడు!


Also read: Dog vs Frog Video: కప్ప ధాటికి తోక ముడిచిన శునకం- వైరల్ వీడియో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook